Movie News

మైత్రికి అభిమానుల టార్చర్ 

ఒక అగ్ర నిర్మాణ సంస్థ నుండి ఓ స్టార్ హీరో సినిమా వస్తుందంటే వాటి అప్ డేట్స్ కోసం ఆ హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రొడక్షన్ హౌజ్ ని ట్యాగ్ చేస్తూ ఆ ప్రొడక్షన్ హౌజ్ నిర్మాతలు , టీంపై ఒత్తిడి తీసుకురావడం కామన్. కానీ ఓ అగ్ర సంస్థ నుండి ఒకే సారి రెండు బడా హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో దిగితే ? ఇరు అభిమానులు అప్ డేట్స్ కోసం , ప్రమోషన్స్ కోసం ఆ సంస్థ ను టార్చర్ పెట్టడం ఖాయం. సరిగ్గా ఇప్పుడు మైత్రికి మెగా , నందమూరి ఫ్యాన్స్ తో అదే టార్చర్ ఉంది.

ఇటు వైపు చిరు ‘వాల్తేరు వీరయ్య’ , అటు బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాల ప్రమోషన్స్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ అభిమానులతో ఇబ్బంది పడుతుంది. మేకింగ్ నుండి థియేటర్స్ రిలీజ్ వరకూ ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతూ మేకర్స్ ఫైనల్ గా ఘాట్ ఫినిష్ చేసి సంక్రాంతి రిలీజ్ కి రెడీ చేస్తుంటే మరో వైపు అభిమానుల తాకిడి నిర్మాతలకు టార్చర్ గా మారింది. 

ఆ హీరో సాంగ్ లాంచ్ అలా చేశారు, మా హీరో సాంగ్ లాంచ్ ఇలా చేశారు అంటూ చాలా ప్రశ్నలే ఎదుర్కుంటున్నారు నిర్మాతలు. అందుకే ఇరు అభిమానలను సంతోష పెట్టేలా ఒకదానికి ఏం చేస్తే మరొక దానికి అదే చేయాల్సి వస్తుంది. బాలయ్య కంటే చిరు ఫ్యాన్స్ మైత్రి పై ఎక్కువ గుస్సా గా ఉంటున్నారు.

అందుకే ఈ మధ్యే వారితో ఓ మీటింగ్ పెట్టుకొని వారిని చల్లార్చే ప్రయత్నం చేశారు మేకర్స్. అందులో భాగంగానే చిరంజీవి వాల్తేరు వీరయ్య కి సెట్ లో ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేశారు. మీడియాతో ఇంట్రాక్షన్ పెట్టుకున్నారు. దీంతో ఇప్పుడు ‘వీరసింహా రెడ్డి’ కి అలాంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే ఆలోచన లేదా అంటూ మైత్రి ను బాలయ్య ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక థియేటర్స్ కూడా ఇటు తక్కువ అటు ఎక్కువ లేకుండా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ముందుగానే నిర్మాతలకు సూచిస్తున్నారు.

ఇది కూడా మైత్రి సంస్థ ను ఖంగారు పెడుతుంది. ఏదేమైనా మైత్రికి ఈ సంక్రాంతి సినిమాలతో పెద్ద ఇబ్బందే. ఒక సంస్థ నుండి సంక్రాంతికి రెండు బడా సినిమాలు రావడం ఇదే మొదటి సారి. ఆ రికార్డ్ మాత్రం మైత్రికే సొంతమైంది.

This post was last modified on December 31, 2022 7:48 pm

Share

Recent Posts

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

18 minutes ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

1 hour ago

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

2 hours ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

3 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

7 hours ago