ఆన్ లైన్లో సంచలనం రేపుతున్న Balakrishna అన్ స్టాపబుల్ షో బాహుబలి ఎపిసోడ్ లో అధిక శాతం ప్రభాస్ పెళ్లి చుట్టే చర్చ జరగడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. మేడం ఎవరూ ఎవరూ బాలయ్య అన్నేసిసార్లు పదే పదే అడగటం అక్కడితో ఆగక రామ్ చరణ్ కు ఫోన్ చేసి ఈ విషయం మీద అయిదు నిమిషాలకు పైగానే సంభాషణ కొనసాగించడం పలు ప్రశ్నలను లేవనెత్తింది. పైగా కృతి సనన్ ఫోటో చూపించి మరీ స్క్రీన్ మీద హైలైట్ చేయడం ఇంకో ట్విస్ట్. Prabhas దాన్ని సోషల్ మీడియా సృష్టేనని నవ్వుతు తేలిగ్గా కొట్టి పారేసినప్పటికీ ఈ టాపిక్ కి అంత టైం అవసరమా అనేదే అసలు డౌట్.
నిజానికి ఈ కృతి సనన్ ఇష్యూ ని నెటిజెన్లు ఎప్పుడో మర్చిపోయారు. భేడియా ప్రమోషన్లో అన్న మాటలను పట్టుకుని సోషల్ మీడియాలో ఓ రెండు రోజులు హడావిడి చేశారు కానీ ఆ తర్వాత ఆగిపోయింది. తిరిగి ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేయడం ద్వారా మరోసారి అనుమానాలకు తావిచ్చినట్టయింది. ఆది పురుష్ లో సీత పాత్ర చేస్తున్న కృతిని అదే పేరుతోనే బాలయ్య సంబోధించి గుర్తు చేయడం వెనుక ఉద్దేశం ఎవరికీ అంతు చిక్కలేదు. అయితే ఫ్యాన్స్ వెర్షన్ మరోలా ఉంది. కేవలం రెండు భాగాలుగా ఎపిసోడ్ ని ప్రీమియర్ చేయడం కోసమే ఎడిటింగ్ లో కోత వేయాల్సిన లెన్త్ ని అలాగే ఉంచేశారని అంటున్నారు.
ఏది ఎలా ఉన్నా కృతి మీద ఎక్కువ ఫోకస్ పడ్డ మాట వాస్తవం. ఒకవేళ త్వరగా తేల్చాయాలి అనుకుంటే నేరుగా ఆమెకే ఫోన్ చేసినా సరిపోయేది. దేశవిదేశాల్లో ఎక్కడ ఉన్నా కనెక్ట్ కావడం క్షణాల్లో పని కదా. అనుష్కను సైతం ఇన్ డైరెక్ట్ గా గుర్తు చేశారు కానీ ఆమె ఇంటి పేరు తప్ప ఇంకేమి వినిపించలేదు. మొత్తానికి ప్రభాస్ పెళ్లి గురించిన సస్పెన్స్ ఇందులోనూ కొనసాగింది. వచ్చే వారం గోపిచంద్ తోనూ దీనికి సంబంధించిన టాపిక్ ఉంది కానీ అప్పుడైనా క్లారిటీ వచ్చే అవకాశాలు తక్కువే. ఇప్పటికే వంద మిలియన్ నిమిషాల వ్యూస్ దాటేసిన బాహుబలి ఎపిసోడ్ ఇంకెన్ని సంచలనాలు రేపనుందో.
This post was last modified on December 31, 2022 11:06 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…