తమిళంలో ప్రస్తుతం ఎవరు నంబర్ వన్ హీరో అనే విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ చర్చకు కారణం టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు. కోలీవుడ్లో విజయే నంబర్ వన్ హీరో అంటూ ఆయన ఒకటికి రెండు ఇంటర్వ్యూల్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకు విజయ్ సినిమాలు టాక్, రిజల్ట్‌తో సంబంధం లేకుండా తమిళనాట రాబట్టిన వసూళ్ల వివరాలను ఉదాహరణగా చెప్పారు.
ఐతే Vijay నంబర్ వన్ హీరో అంటే అజిత్ అభిమానులు ఒప్పుకోవట్లేదు. తమ హీరోకు ఏం తక్కువ.. ఈ ఏడాది విజయ్ సినిమా ‘బీస్ట్’ తుస్సుమనిపిస్తే.. అజిత్ మూవీ ‘వలిమై’ బ్లాక్‌బస్టర్ అయిన విషయాన్ని ఉదహరిస్తున్నారు. ‘విశ్వాసం’ లాంటి మామూలు సినిమాతో తమిళనాట అజిత్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయాన్ని కూడా ఉదాహరణగా చెబుతున్నారు. ఐతే ఇప్పటిదాకా ఏం జరిగిందన్నది పక్కన పెడితే.. సంక్రాంతికి విజయ్ సినిమా ‘వారిసు’, అజిత్ మూవీ ‘తునివు’ ఒకేసారి రిలీజవుతుండడంతో వీరిలో ఎవరిది పైచేయి అన్నది తేలిపోనుంది.
ఐతే తమిళనాట ఎవరు పైచేయి సాధిస్తారో ఏమో కానీ.. విదేశాల్లో మాత్రం విజయ్ ముందు అజిత్ అస్సలు నిలవలేకపోతున్నాడు. యుఎస్, యూకే సహా ప్రతి దేశంలోనూ విజయ్ సినిమా ఆధిపత్యమే కనిపిస్తోంది. యుఎస్‌లో ‘వారిసు’ దాదాపు నాలుగొందల స్క్రీన్లలో రిలీజవుతుంటే.. అజిత్ మూవీకి వంద స్క్రీన్లు కూడా ఇవ్వట్లేదు. యూకేలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఐరోపాలో కూడా ‘వారిసు’ జోరు ముందు ‘తునివువ’ నిలబడే పరిస్థితే లేదు. ఫ్రాన్స్‌లో విజయ్ మూవీకి 2 వేలకు పైగా షోలు పడుతుంటే.. అజిత్ చిత్రానికి మరీ నామమాత్రంగా మూణ్నాలుగు షోలు మాత్రమే ఇచ్చారట.
తమిళనాట విజయ్‌కు దీటైన ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న Ajith.. విదేశాల్లో కనీస స్థాయిలోనూ తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించలేకపోతుండడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇండియాలో కూడా తమిళనాడు అవతల విజయ్‌కి ఉన్న మార్కెట్, ఫాలోయింగ్ అజిత్‌కు లేదనే చెప్పాలి.
This post was last modified on December 30, 2022 2:16 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…