పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను వర్మ తన పవర్ స్టార్ లో వ్యంగ్యంగా చూపించబోతున్నాడని అభిమానులు గుర్రుగా ఉన్నారు. తనని ఎంత మంది ఎన్ని రకాలుగా తిట్టిపోస్తున్నా కానీ వర్మ మాత్రం తన మినీ మూవీ ఫెస్టివల్ ఇప్పట్లో ఆగదంటున్నాడు. ఏటిటి అంటూ తన షార్ట్ వీడియోలతో లాక్ డౌన్ లో సొమ్ము చేసుకుంటున్న వర్మ ఇలాంటివి తీయడానికి సెన్సషనల్ టాపిక్స్ ఏమిటంటూ ఆలోచిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ పై తనకు ఎలాంటి అక్కసు లేదా పగ లేదని, ప్యూర్ బిజినెస్ అని సన్నిహితులకు చెబుతున్నట్టు టాక్. ఈ సినిమా అయిన తర్వాత బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పుల ఘటన ఆధారంగా మినీ సినిమా తీస్తాడట. ఆ సినిమా అనౌన్స్ చేయడం ద్వారా తనకు పవన్ తో ఎలాంటి పొరపొచ్చాలు లేవని, ఇలా అందరి గురించి, అన్నిటి గురించి సినిమాలు తీసుకుంటానని చెప్పాలనేది వర్మ తాపత్రయం కావచ్చు.
పవర్ స్టార్ సినిమాలో పవన్ ని గేలి చేసాడేమో అని యాంటీ ఫాన్స్, అతడి గురించి ఏమి చూపించాడో అనే ఆందోళనతో ఫాన్స్ ఈ సినిమా ఎగబడి చూస్తారని వర్మ ఆశ. మరి వర్మ తీస్తున్న మ్యాటర్ లేని షార్ట్ వీడియోల్లో ఇదీ ఒకటవుతుందా?
Gulte Telugu Telugu Political and Movie News Updates