Movie News

బ్రేకప్ వార్తలకు ఫొటోతో ఫుల్ స్టాప్

శ్రుతి హాసన్ ప్రేమాయణాల గురించి ఎప్పటికప్పుడు ఊహాగానాలు పుడుతుంటాయి. మొదట్లో ఆమె సిద్దార్థ్‌తో ప్రేమలో ఉన్నట్లు గుసగుసలు వినిపించాయి. కానీ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గట్టి ఆధారాలేమీ కనిపించలేదు. ఐతే తర్వాత మైకేల్ కొర్సాల్ అనే బ్రిటిష్ కుర్రాడితో శ్రుతి ప్రేమలో ఉన్న సంగతి అధికారికంగానే వెల్లడైంది. అతను చెన్నైకి వచ్చి పట్టు వస్త్రాలు ధరించి శ్రుతి కుటుంబంతో కలిసి కొన్ని వేడుకల్లో కూడా పాల్గొనడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కానీ ఏం జరిగిందో ఏమో.. తర్వాత ఇద్దరూ విడిపోయారు. కొన్నేళ్లు శ్రుతి సింగిల్‌గానే ఉండిపోయింది.

తర్వాత శాంతను హజారికా అనే అస్సాం కుర్రాడితో శ్రుతి ప్రేమలో పడడం తెలిసిందే. రెండేళ్ల ముందే తమ రిలేషన్‌షిప్ గురించి ఈ ఇద్దరూ ఓపెన్ అయిపోయారు. ఒక టైంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ ఈ మధ్య వీళ్లిద్దరికీ చెడిందని.. బ్రేకప్ దిశగా అడుగులు వేస్తున్నారని వార్తలు వచ్చాయి.

శ్రుతి మౌనంగా ఉండడంతో ఈ అనుమానాలు నిజమే అనుకున్నారు. కానీ ఆమె ఆ ఊహాగానాలకు చెక్ పెట్టేసింది. శాంతను తనతో క్లోజ్‌గా ఉన్న ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తాను కోరుకునేది ఇదే అంటూ తన ప్రియుడితో ఆత్మీయ బంధం కొనసాగుతున్న విషయాన్ని చాటింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా శాంతను గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడింది శ్రుతి. అప్పుడు ఆమె అతను తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ పేర్కొనడం విశేషం.

ఇక కెరీర్ విషయానికి వస్తే.. కొంచెం గ్యాప్ తర్వాత రీఎంట్రీలో శ్రుతి దూసుకెళ్తోంది. ‘క్రాక్’ లాంటి క్రాకింగ్ హిట్‌తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటిన ఆమె.. రాబోయే సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో డబుల్ ధమాకా అందించబోతోంది. ఈ రెండూ హిట్టయ్యాయంటే శ్రుతి కెరీర్ మరింత దూసుకెళ్లడం ఖాయం. ప్రభాస్ సరసన ‘సలార్’ లాంటి భారీ చిత్రంలోనూ శ్రుతి నటిస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on December 22, 2022 6:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

4 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

6 hours ago

‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే…

7 hours ago

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో…

8 hours ago

మహేష్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు.. జర భద్రం!

క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…

9 hours ago