Movie News

పూజా హెగ్డేని లైట్ తీసుకున్నారా

గత నెల విడుదలైన దృశ్యం 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేసిన బాలీవుడ్ ఇప్పుడు 23న రిలీజ్ కాబోతున్న సర్కస్ మీద గురి పెట్టింది. రణ్వీర్ సింగ్ హీరోగా డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు. యాక్షన్ అయినా సింగం అయినా చెన్నై ఎక్స్ ప్రెస్ లాంటి కామెడీ డ్రామా అయినా తనదైన శైలిలో మాస్ టచ్ ఇస్తాడని గుర్తింపు ఉన్న ఇతని మీద పెద్ద అంచనాలే ఉన్నాయి. ప్రమోషన్లు బలంగా చేశారు. ట్రైలర్ లో ఎంటర్ టైన్మెంట్ కనిపించింది కానీ ఆ స్థాయిలో సినిమా మొత్తం ఉంటేనే హిట్టు కొడుతుంది లేదంటే రణ్వీర్ సింగ్ కు ఈ ఏడాది మరో షాక్ తప్పదు.

ఇందులో ఇద్దరు హీరోయిన్లు. దీపికా పదుకునే మాత్రమే హైలైట్ అవుతుండగా పూజా హెగ్డేని టీమ్ పెద్దగా ప్రమోట్ చేయడం లేదు. తను ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ షూటింగ్ తో పాటు మహేష్ బాబు 28తో బిజీగా ఉంది కానీ వీలు చూసుకుని రమ్మంటే కాదనలేదుగా. అయినా కూడా తన కన్నా ఎక్కువగా దీపికా పేరే వినిపిస్తోంది. ప్రాధాన్యత విషయంలో ముంబై మీడియా భార్యాభర్తల వైపే మొగ్గు చూపిస్తోంది. పైగా ఆ మధ్య వదిలిన వీడియో సాంగ్ లో రణ్వీర్ దీపికల జోడి, డాన్సు కనువిందుగా ఉండటంతో పూజా పాత్ర నామమాత్రమేనా అనే అనుమానం కలగడం సహజం.

టాలీవుడ్ లో ఎంత దివ్యమైన కెరీర్ ఉన్నప్పటికీ బాలీవుడ్ లోనూ నెగ్గాలని పూజా హెగ్డే ఎప్పటి నుంచో ట్రై చేస్తోంది. 2016లో హృతిక్ రోషన్ తో మోహెన్జొదారోతో డెబ్యూ చేసినప్పుడు అది డిజాస్టర్ కొట్టింది ఆ తర్వాత హౌస్ ఫుల్ 4 చేసింది కానీ అందులో క్యాస్టింగ్ ఎక్కువ ఉండటంతో గుంపులో గోవిందా అయ్యింది. రాధే శ్యామ్ హిందీలోనూ ఏమంత గొప్పగా ఆడలేదు. అయినా పట్టు వదలకుండా మరో రెండు ఒప్పేసుకుంది. తీరా చూస్తే సర్కస్ బుకింగ్స్ ఏమంత స్పీడ్ గా లేవు. టాక్ వస్తేనే నిలబడుతుంది. మరి సీనియర్ సల్లు భాయ్ కి జోడిగా నటించిన కిభాకిజా అయినా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

This post was last modified on December 21, 2022 11:43 am

Share

Recent Posts

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

53 minutes ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

3 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

3 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

4 hours ago

రాజమౌళి చెప్పిన ఈ ఫార్ములా ఫాలో అయితే?

రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…

4 hours ago

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

5 hours ago