ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసినా.. తన బేనర్ నుంచి వస్తున్న అనువాద చిత్రం ‘వారసుడు’కు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు పట్టున్న ఏరియాల్లో ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లకు దీటుగా స్క్రీన్లు అట్టిపెట్టేస్తున్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. చిరు, బాలయ్య సినిమాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు లేని బాధ మిగతా వాళ్లకు ఎందుకు.. అయినా ముందు రిలీజ్ డేట్ ప్రకటించింది మా సినిమాకే.. అంటూ ఆయన తన వాదనను గట్టిగానే వినిపించారు.
ఈ లాజిక్కులు ఎలా ఉన్నా సరే.. చిరు, బాలయ్యల ముందు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ మార్కెట్ ఎంత.. ఆయన సినిమాకున్న క్రేజెంత అన్న ప్రశ్న తలెత్తితే.. ఆ సినిమాకు కేటాయిస్తున్న థియేటర్ల సంఖ్య సహేతుకంగా అనిపించడం లేదు. వైజాగ్ సిటీలో చిరు, బాలయ్యల సినిమాలకు తలో నాలుగు థియేటర్లు కేటాయించి.. విజయ్ చిత్రానికి 6 స్క్రీన్లు ఇచ్చారన్న ప్రచారం రాజు మీద విమర్శలకు మరింత ఊతమిస్తోంది.
ఇదిలా ఉంటే.. అంతిమంగా బాగున్న సినిమా ఆడుతుంది, మిగతావి పక్కకు వెళ్లిపోతాయని రాజు సహా ఇండస్ట్రీ పెద్దలందరూ అంటుంటారు. ఐతే ఒకవేళ ‘వారసుడు’ చిత్రానికి టాక్ బాలేకపోయి.. లేదంటే మనవాళ్లకు దాని పట్ల ఆసక్తి లేక ఆక్యుపెన్సీ అంతంతమాత్రంగా ఉండి.. అదే సమయంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు మంచి టాక్ వచ్చి వాటికి డిమాండ్ పెరిగితే, అందుకు తగ్గట్లుగా థియేటర్లు లేకపోతే.. అప్పుడు దిల్ రాజు తగ్గుతాడా అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది.
సంక్రాంతి సెలవులన్నీ అయిపోయాక, వారం పది రోజుల తర్వాత ‘వారసుడు’కు స్క్రీన్లు తగ్గించి వేరే వాటికి ఇవ్వడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. సెలవుల్లోనే ఎవరికైనా గరిష్ట ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ ‘వారసుడు’కు రెండో రోజు నుంచి డిమాండ్ లేని పక్షంలో వీకెండ్లోనే థియేటర్లు, షోలు తగ్గించి మిగతా చిత్రాలకు ఇచ్చినట్లయితే అప్పుడు దిల్ రాజుది పెద్ద మనసు, ఇండస్ట్రీ బాగు కోసమే ఆయన ఆలోచిస్తారని భావించవచ్చు. అలా కాకుంటే మాత్రం ఇప్పుడు ఆయన చెబుతున్న మాటలకు విలువ ఉండదు.
This post was last modified on December 18, 2022 10:47 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…