‘పెళ్లి సందడి’ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ కొట్టి అక్కడి నుండి నైజాం రాజు గా ఎదిగి దిల్ సినిమాతో నిర్మాతగా కేరీర్ మొదలు పెట్టాడు దిల్ రాజు. ఇప్పుడు స్టార్ నిర్మాతగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నాడు.
ప్రస్తుతం హిందీ, తమిళ్ లో కూడా నిర్మాతగా సినిమాలు తీస్తున్న దిల్ రాజు పై కొన్నేళ్లుగా ఓ కామెంట్ వినిపిస్తుంటుంది. కెరీర్ ఆరంభంలో టాలెంటెడ్ డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దిల్ రాజు ప్రస్తుతం కొత్త దర్శకులతో సినిమాలు చేయడం లేదనేది ఆ కామెంట్.
తాజాగా ఓ చిన్న సినిమాతో ఆ కామెంట్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు దిల్. తన ఫ్యామిలీ నుండి హర్షిత్ రెడ్డి , హన్శిత లను నిర్మాతలుగా పరిచయం చేస్తూ కాన్సెప్ట్ సినిమాలు తీసే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా మరో బేనర్ స్టార్ట్ చేశారు రాజు. దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే సబ్ బేనర్ స్టార్ట్ చేసి కొత్త దర్శకులను పరిచయం చేయబోతున్నాడు.
ఈ బేనర్ నుండి కమెడియన్ వేణు టిల్లును మొదటి దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. కమెడియన్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ నుండి ‘బలగం’ అనే సినిమా రాబోతుంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి తన కొత్త బేనర్ లోగో కూడా లాంచ్ చేశారు రాజు.
వేణును దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు పోస్టర్ రిలీజ్ చేయగానే రాజు గారు ఎన్నాళ్లకెన్నాళ్ళకి కొత్త దర్శకుడితో సినిమా అంటూ సోషల్ మీడియా లో నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇకపై ఇదే కంటిన్యూ చేసి మళ్ళీ మునుపటిలా కొత్త వారిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు. మరి దిల్ రాజు ప్రొడక్షన్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ లా మొదట్లో అందించినట్టుగా ఉత్తమ సినిమాలను అందిస్తుందా ? చూడాలి.
This post was last modified on December 16, 2022 8:26 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…