ధమాకా.. డల్లుగా సాగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మళ్లీ ఊపు తెస్తుందని అంచనా వేస్తున్న సినిమా. ‘హిట్-2’ తర్వాత సరైన సినిమా లేక టాలీవుడ్ బాక్సాపీస్ వెలవెలబోతున్న సంగతి తెలిసిందే. గత వారం పేరుకు 17 సినిమాలు రిలీజయ్యాయి కానీ.. వాటిలో ఏదీ నిలబడలేదు.
ఈ వారం బాక్సాఫీస్‌ను పూర్తిగా ‘అవతార్-2’కే రాసిచ్చేశారు. వారం తర్వాత క్రిస్మస్ కానుకగా రెండు తెలుగు చిత్రాలు, రెండు అనువాదాలు రిలీజవుతుండగా.. అందులో ఎక్కువ అంచనాలు ఉన్నది రవితేజ సినిమా అయిన ‘ధమాకా’ మీదే.
తాజాగా లాంచ్ అయిన ట్రైలర్ ఈ నెల 23న మంచి మాస్ ట్రీట్ గ్యారెంటీ అన్న అంచనాలు రేకెత్తించింది. సినిమా మరీ కొత్తగా ఉంటుందన్న ఆశల్లేవు కానీ.. ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారెంటీ అనిపిస్తోంది. ఈ సినిమా హిట్టవడం రవితేజకు చాలా అవసరం. ఈ ఏడాది మాస్ రాజా నుంచి వచ్చిన ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ దారుణంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే.
ఐతే ఇంతకుముందు సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే.. ఇలా వరుసగా మూడు హిట్లు కొట్టిన రైటర్-డైరెక్టర్ జోడీ ప్రసన్న కుమార్ బెజవాడ-త్రినాథ రావు నక్కిన నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘ధమాకా’ మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయాలున్నాయి.
ముఖ్యంగా రైటర్ ప్రసన్న కుమార్ మీద యూత్‌కు బాగానే గురి ఉంది. అతడి కథలు అంత కొత్తగా ఏమీ ఉండవు. పాత కథలనే అటు ఇటు తిప్పి యూత్‌కు నచ్చే ఎంటర్టైన్మెంట్‌తో వడ్డిస్తుంటాడతను. గతంలో విజయ భాస్కర్ ఎలా అయితే త్రివిక్రమ్ అండతో ఎలా హిట్లు కొట్టాడో.. త్రినాథరావు సైతం ప్రసన్నకుమార్ సపోర్ట్‌తో సక్సెస్‌లు సాధిస్తున్నాడనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.
అందులోనూ ఈసారి కథ, మాటలతో సరిపెట్టకుండా ‘స్క్రీన్ ప్లే’ క్రెడిట్ కూడా ప్రసన్న కుమారే తీసుకున్నాడు. దర్శకుడిగా మారడానికి కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇలా హోల్ రైటింగ్ క్రెడిట్ తనే తీసుకోవడం విశేషం. కాబట్టి సినిమా బాగా ఆడితే మార్మోగేది అతడి పేరే. ఎక్కువ క్రెడిట్ దక్కేది తనకే నాగార్జున చిత్రంతో అతను దర్శకుడిగా మారనున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంల ో ఈ చిత్రం హిట్టయితే ప్రసన్న కుమార్ రాత మారిపోయినట్లే.
This post was last modified on December 16, 2022 8:30 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…