అవతార్-2 సినిమా ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఇప్పటిదాకా ప్రపంచ సినీ చరిత్రలోనే ఏ చిత్రం లేని స్థాయిలో దీనికి బిగ్గెస్ట్ రిలీజ్ దక్కింది. అంచనాల పరంగా చూసినా ఈ సినిమాకు దరిదాపుల్లో నిలిచే చిత్రం ఇంకేదీ ఉండదనే చెప్పాలి. ఐతే శుక్రవారం రెగ్యులర్ షోలు పడడానికి ముందే ‘అవతార్-2’ పైరసీ వెర్షన్ ఆన్ లైన్లోకి వచ్చేయడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
యుఎస్ సహా పలు దేశాల్లో ఈ చిత్రానికి ప్రిమియర్లు వేశారు. మరి ఎక్కడి నుంచి సినిమా లీకైందన్నది అర్థం కాని విషయం. కొందరు ఉత్సాహం ఆపుకోలేక పైరసీ వెర్షన్ చూసేస్తున్నట్లున్నారు. కానీ ‘అవతార్-2’ను పైరసీ చేయడం వెర్రితనం కాక మరొకటి కాదు. పైరసీలో ఈ సినిమా చూడాలనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. ‘అవతార్’ లాంటి సినిమాలను చూస్తే థియేటర్లలోనే చూడాలి. హెచ్‌డీ ప్రింటును హోం థియేటర్లలో వేసుకుని చూసినా కూడా ఎంతో కొంత అసంతృప్తి తప్పదు.
అలాంటిది పైరసీ వెర్షన్‌ను మొబైల్స్‌లోనో, కంప్యూటర్లలోనో, టీవీల్లోనో చూస్తే ఏం అనుభూతి కలుగుతుంది? నిజానికి ఈ సినిమాను మామూలు థియేటర్లలో చూడ్డానికి కూడా ప్రేక్షకులు ఇష్టపడట్లేదు. అత్యుత్తమ టెక్నాలజీ ఉన్న మల్టీప్లెక్సుల్లో, కుదిరితే ఐమాక్స్ స్క్రీన్లలో చూడాలనుకుంటున్నారు. వాటిలో కూడా త్రీడీ వెర్షన్ అందుబాటులో ఉన్న థియేటర్లనే ఎంచుకుంటున్నారు. ఈ సినిమాలో కథాకథనాల కంటే విజువల్ మాయాజాలమే ప్రేక్షకులను ఆకట్టుకునేది. అలాంటి సన్నివేశాలు పైరసీ ప్రింట్లో చూస్తే ఏం కిక్కు ఉంటుంది? కాబట్టి పైరసీ వెర్షన్ చూడడం అన్నది వేస్ట్.
నిజానికి మిగతా సినిమాల పైరసీ వెర్షన్ల కోసం ఎగబడే వాళ్లు కూడా దీన్ని పట్టించుకునే అవకాశాలు తక్కువ. కాబట్టి పైరసీ వెర్షన్ గురించి డిస్నీ వాళ్లు కానీ.. డిస్ట్రిబ్యూటర్లు కానీ పెద్దగా కంగారు పడాల్సిన అవసరం కూడా లేదని చెప్పొచ్చు. ఆ సంగతి పక్కన పెడితే ‘అవతార్-2’కు కొంచెం మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పటికీ వీకెండ్లో రికార్డు వసూళ్లు సాధించడం పక్కా.
This post was last modified on December 16, 2022 2:36 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…