అద్నాన్ సమి.. పేరుకు పాకిస్థానీ అయినా.. ఈ లెజెండరీ సింగర్‌కు ఎక్కువ పేరు వచ్చింది ఇండియన్ సినిమాలతోనే. ఒక దశలో తన పాటతో ఎంతగా ఆకట్టుకున్నాడో.. 200 కిలోలకు పైగా బరువుతో, భారీ అవతారంలో అదే స్థాయిలో జనాల దృష్టిని ఆకర్షించాడు. అంత బరువున్న వాడు తర్వాత సర్జరీ చేయించుకుని సన్నగా మారడం ఓ సంచలనం. ఇక అద్నాన్ పాడిన హిందీ, తెలుగు పాటల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.
తెలుగులో నచ్చావే నైజాం పోరి (వర్షం), ఏ జిల్లా ఏ జిల్లా (శంకర్ దాదా ఎంబీబీఎస్), భూగోళమంత సంచిలోనా (శంకర్ దాదా జిందాబాద్), నేనంటే నాకు (ఊసరవెల్లి) లాంటి పాటలతో ఆయన ఇక్కడ బాగానే అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ పాటలన్నీ కూడా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినవే అన్న సంగతి తెలిసిందే. ఐతే ‘ఊసరవెల్లి’ తర్వాత అద్నాన్ తెలుగులో పాటలు పాడినట్లు లేడు.
పాకిస్థాన్‌కు గుడ్‌బై చెప్పేసి ఇండియన్ సిటిజన్‌షిప్ తీసుకుని మనదేశంలోనే సెటిలైపోయిన అద్నాన్ సమి.. ఎక్కువ హిందీ చిత్రాలకే పరిమితం అయిపోయాడు. ఐతే చాలా ఏళ్ల తర్వాత ఈ లెజెండరీ సింగర్ తెలుగులో పాట పాడడం విశేషం. ఇప్పటికే చిరంజీవికి రెండు పాటలు పాడిన సమి.. రీఎంట్రీ కూడా చిరు సినిమాతోనే ఇస్తున్నాడు.
మరోసారి దేవిశ్రీ ప్రసాదే ఆయనతో పాట పాడించాడు. ‘వాల్తేరు వీరయ్య’ కోసం ఇదంతా జరిగింది. ఈ సినిమా నుంచి ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా’ అంటూ సాగే పాట గురించి చిరు స్వయంగా లీక్ చేసిన సంగతి తెలిసిందే. చిరు లీక్ చేసిన ట్రాక్‌లో దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ వినిపించింది. నిజంగా ఆ పాటను దేవీనే పాడాడేమో అని కొందరు కంగారు పడ్డారు. కానీ ఒరిజినల్ సాంగ్ పాడింది అద్నాన్ సమి అని తెలిసి హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంత గ్యాప్ తర్వాత చిరు కోసం మళ్లీ అద్నాన్ తెలుగు పాట పాడడంతో అది చాలా స్పెషల్‌గా ఉంటుందన్న అంచనాతో ఉన్నారు. కొన్ని రోజుల్లోనే ఈ పాట రిలీజ్ కాబోతోంది.
This post was last modified on December 15, 2022 2:58 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…