మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి మూవీ ‘వాల్తేరు వీరయ్య’ నుండి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. వేర్ ఈజ్ ద పార్టీ అంటూ వచ్చిన ఆ సాంగ్ మొదట ట్రోలింగ్ కి గురైంది.
ప్రోమోలో దేవి వాయిస్ విని అందరూ ట్రోల్ చేశారు. కానీ ఫుల్ సాంగ్ రిలీజయ్యాక మెల్లగా సూపర్ హిట్ అనిపించుకుంది. మళ్ళీ వీరయ్య తో దేవి ఇంకోసారి ట్రోలింగ్ కి దొరికేశాడు.
చిరంజీవి -శృతి హాసన్ ల మీద ఫ్రాన్స్ లో డ్యూయెట్ సాంగ్ తీశారు. తాజాగా ఆ సాంగ్ షూట్ పూర్తయింది. ఈ ఫ్రాన్స్ లోకేషన్స్ లో సాంగ్ షూట్ గురించి చెప్తూ చిరు ఇన్స్టా లో షార్ట్ వీడియో పోస్ట్ చేశారు.
చిరు ఇలా… సాంగ్ గురించి ఓ వీడియో పోస్ట్ పెట్టాడో లేదో వెంటనే దేవిశ్రీ ని తగులుకున్నారు ఫ్యాన్స్. చిరు పెట్టిన వీడియోలో సాంగ్ ఎలా ఉండబోతుందో చెప్తూ లీక్ అనే పేరుతో సాంగ్ గ్లిమ్స్ చూపించారు. అందులో నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి అంటూ ఓ లిరిక్ దేవి పాడాడు. వీడియో ఎండింగ్ లో దేవి వాయిస్ తో వచ్చే సాంగ్ గ్లిమ్స్ చూసి అందరూ దేవి మళ్ళీ రొటీన్ సాంగ్ తో వస్తున్నాడని , గతంలో శంకర్ దాదా సాంగ్ గుర్తొస్తుందని వివిధ రకాల పోస్టులు పెడుతున్నారు మెగా ఫ్యాన్స్.
ఇక ట్రోలర్స్ కూడా మళ్ళీ దేవి వాయిస్ ఆ ? వామ్మో అంటూ ఏవో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో దేవిని ఎటాక్ చేస్తున్నారు. చిరు వదిలిన ఈ చిన్న సాంగ్ గ్లిమ్స్ లో దేవి వాయిస్ వినబడే సరికి అందరూ నెగటివ్ గా మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా వీరయ్య తో దేవికి పెద్ద గోలే ఉంది. రిలీజయ్యే ప్రతీ సాంగ్ పై ట్రోలింగ్ జరుగుతుంది. మరి ఫస్ట్ సింగిల్ హిట్ చేసి ట్రోలర్స్ యాంటీ ఫ్యాన్స్ నోర్లు మూయించిన దేవి సెకండ్ సింగిల్ తో ఏం చేస్తాడో చూడాల్సిందే.
This post was last modified on December 14, 2022 7:57 pm
కోలీవుడ్‌లో ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్న హీరోల్లో శింబు ఒకడు. తన ప్రవర్తన అనేకసార్లు వివాదాస్పదమైంది. హీరోయిన్లతో ఎఫైర్లు.. నిర్మాతలు,…
అమరావతి రాజధాని ప్రాంతంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభ.. వేదికపై జరిగిన కొన్ని కీలక పరిణా మాలు చూస్తే.. జనసేన…
ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. ఆయన కలలు కంటున్న రాజధాని అమరావతి పేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది.…
వైసీపీలో నాయకులు చాలా మంది డి-యాక్టివేషన్లో ఉన్నారు. కాకలు తీరిన కబుర్లు చెప్పిన నాయకులు కూడా మౌనంగా ఉంటూ.. రమణ…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు .. రాష్ట్ర రాజధాని అమరావతిపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. అదేసమయంలో రాజధాని…
ఈసారి ఐపీఎల్ మొదలవుతుండగా.. అందరి కళ్లూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మీదే నిలిచాయి. ఆ జట్టును టైటిల్‌కు హాట్ ఫేవరెట్‌గా పేర్కొన్నారు…