కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘బింబిసార’ తో ఈ ఏడాది బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అనిపించుకున్నాడు వసిష్ఠ. ఈ సినిమా సక్సెస్ తో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటున్నాడు. నెక్స్ట్ గీతా ఆర్ట్స్ నుండి ఓ అడ్వాన్స్ అందుకున్నాడు. అలాగే బాలయ్య కూడా సినిమా చేద్దాం కథ సిద్దం చేసుకోమని చెప్పేశాడు. మరో వైపు బింబిసార 2 కథ రెడీ గా ఉంది. వచ్చే ఏడాది ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళబోతుందని చెప్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే వసిష్ఠ రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీ కాంత్ కి ఓ స్క్రిప్ట్ చెప్పి వచ్చాడు. బింబిసార రిలీజ్ అయిన వెంటనే డైరెక్ట్ గా చెన్నై లో వాలిపోయి రజినీతో ప్రాజెక్ట్ లాక్ చేసుకొచ్చాడు. తాజాగా రజినీ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి స్పెషల్ గా విషెస్ చెప్పాడు. ఈ పోస్ట్ తో వసిష్ఠ రజినీతో చేయబోయే ప్రాజెక్ట్ ను ఇన్ డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసినట్టయింది.
అయితే ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం లేదు. ఇంకా టైం పట్టొచ్చు. బింబిసార 2 తర్వాతే వసిష్ఠ నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ మెంట్ ఉండనుంది. మరి ఆ సినిమా రిలీజ్ తర్వాతే సూపర్ స్టార్ తో చేయబోయే ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి కళ్యాణ్ రామ్ ను ఎవరూ ఊహించని రోల్ లో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసి మేస్మరైజ్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్ సూపర్ స్టార్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.
This post was last modified on December 12, 2022 9:51 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…