హిందీ జనాలకు ఇదేం పిచ్చో అర్థం కాదు. దక్షిణాదిన ఏదైనా మాస్ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తే చాలా విరగబడి చూసేస్తున్నారు. అది హిట్ సినిమానా.. ఫ్లాప్ సినిమానా అన్నది సంబంధం లేదు. మాస్ అంశాలుండి.. భారీ యాక్షన్ ఘట్టాలుంటే ఆ చిత్రానికి వ్యూస్ పంట పండినట్లే. మన దగ్గర పెద్దగా హిట్లు లేని బెల్లంకొండ శ్రీనివాస్ కూడా వాళ్ల దృష్టిలో పెద్ద సూపర్ స్టార్ అన్నట్లే.
అతడి సినిమాలకు కూడా అక్కడ కోట్లల్లో వ్యూస్ వస్తాయి. ఇక అల్లు అర్జున్ లాంటి మాస్ హీరోకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పేదేముంది? అతడి సినిమాలకు పదుల కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దువ్వాడ జగన్నాథం, సరైనోడు సినిమాలు పోటాపోటీగా వ్యూస్ సాధించాయి.
ముఖ్యంగా ‘సరైనోడు’ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో రిలీజ్ చేస్తే.. వ్యూస్, లైక్స్ మోత మోగిస్తూ దూసుకెళ్లింది. ఇప్పటికే యూట్యూబ్ వ్యూస్ విషయం కొత్త కొత్త రికార్డులు నెలకొల్పుతూ వెళ్లిన ఆ చిత్రం.. ఇప్పుడు ఏకంగా 30 కోట్ల వ్యూస్ మార్కును అందుకుంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే యూట్యూబ్‌యే కాదు.. మరే మాధ్యమంలోనూ ఇన్ని వ్యూస్ తెచ్చుకున్న సినిమా మరొకటి లేదు.
హిందీలో.. ఏకంగా 30 కోట్ల మంది ఈ సినిమా చూడటమంటే మాటలా? దీన్ని బట్టి ఉత్తరాది జనాలు బన్నీ సినిమాలంటే ఎలా పడి చస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ హీరోలు మాస్ సినిమాలు మానేసి క్లాస్ మంత్రం పఠిస్తుండటంతో బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మాస్ ప్రేక్షకులు తెలుగు నుంచి వచ్చే డబ్బింగ్ మాస్ సినిమాల పని పడుతున్నారు. జియో పుణ్యమా అని రోజుకు జీబీల్లో ఇంటర్నెట్ చౌకగా వస్తోంది. దీంతో వాళ్లు మన సినిమాలకు ఇలా కోట్లల్లో వ్యూస్ ఇస్తున్నారు.
This post was last modified on July 16, 2020 2:17 pm
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…