టెక్నాలజీ, ఇంటర్నెట్ మనిషి జీవితంలో భాగమైపోయిన తరుణంలో గూగుల్ లేకుండా సగటు మనిషి తనను తాను ఊహించుకోవడం కష్టమే. ఏదైనా సమాచారం కావాలన్నా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడి ప్రాంతాల గురించి తెలుసుకోవాలన్నా ప్రతిఒక్కరికి అరచేతిలో ఇది అందిస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. అంతెందుకు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చినోళ్ళు మ్యాప్ వాడకుండా కావాల్సిన చోటుకి వెళ్లడం అసలు ఊహించుకోగలమా. వీటికే ఇలా ఉంటే ఇక సినిమాలకు సంబంధించి చెప్పేదేముంది. బ్లాక్ అండ్ వైట్ కాలంతో మొదలుపెట్టి లేటెస్ట్ రిలీజుల దాకా మూవీ లవర్స్ విపరీతంగా ఆధారపడే సెర్చ్ ఇంజిన్ గూగుల్.
ఇండియాలో సగటున ఎవరు ఎక్కువగా ఏ సినిమాల గురించి వెతికారనే డేటా బయటికి తెస్తే అందులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి. ముందుగా తెలుగు చూస్తే టాప్ 5 సెర్చ్ చేసినవాటిలో వరసగా ఆర్ఆర్ఆర్, పుష్ప , లైగర్, కార్తికేయ 2, రాధే శ్యామ్ లు ఉన్నాయి. డిజాస్టర్లకు సైతం చోటు దక్కిందంటే విజయ్ దేవరకొండ, ప్రభాస్ ల ఇమేజ్ ఏ స్థాయిలో పని చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నుంచి సీతారామం, సర్కారు వారి పాట, మేజర్, ఆది పురుష్, శ్యామ్ సింగ రాయ్ లు చోటు దక్కించుకున్నాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బింబిసార లేకపోవడం గమనార్హం
తమిళం సంగతి చూస్తే ఎక్స్ పెక్ట్ చేసినట్టే కమల్ హాసన్ విక్రమ్ అగ్ర తాంబూలం అందుకోగా ఆ తర్వాత పొన్నియన్ సెల్వన్ 1, బీస్ట్, రాకెట్రీ, లవ్ టుడే క్యూ కట్టాయి. తర్వాతి సగంలో వలిమై, తిరు, మహాన్, కోబ్రా, విరుమాన్ ప్లేస్ దక్కించుకున్నాయి. కన్నడలో కెజిఎఫ్ 2, మలయాళంలో హృదయంలకు ఫస్ట్ ప్లేస్ దక్కాయి. సౌత్ ఇండియా మొత్తంగా టాప్ సెర్చ్ లో నిలిచింది మాత్రం బంగారు గనుల్లో అరాచకం చేసిన రాఖీ భాయ్ కెజిఎఫ్ 2నే . ఆ తర్వాతే ఆర్ఆర్ఆర్ ఉంది. బాక్సాఫీస్ ఫలితాలకు ఈ గూగుల్ సెర్చ్ ఫలితాలు చాలా దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయి. ప్యాన్ ఇండియా లెవెల్ లో దక్షిణాది డామినేషన్ స్థాయిది.
This post was last modified on December 8, 2022 12:32 pm
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…