టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ వంశీ.. తమ కెరీర్లలో ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొంటున్నారు ఇప్పుడు. తమిళంలో రజినీకాంత్‌ను మించి టాప్ స్టార్‌గా ఎదిగిన విజయ్.. తమిళంలో ఎంతోమంది పెద్ద దర్శకులు, నిర్మాతలు తన కోసం ఎగబడుతుంటే వారిని పక్కన్న పెట్టి ఈ ఇద్దరికీ ఛాన్స్ ఇచ్చాడు. ఐతే వంశీ ట్రాక్ రికార్డు చూసి విజయ్ అభిమానులు ఈ సినిమా మీద పూర్తి నమ్మకంతో అయితే లేరు. అందులోనూ వారిసు/వారసుడు సినిమా పోస్టర్లవీ చూస్తే ‘మహర్షి’కి ఇంకో వెర్షన్ లాగా కనిపించడం.. ఊర మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన విజయ్‌ను అంత క్లాస్‌గా చూపించడం మెజారిటీ అభిమానులకు నచ్చలేదు.
సంక్రాంతికి ‘వారిసు’కు పోటీగా అజిత్ సినిమా ‘తునివు’ భారీ అంచనాల మధ్య రిలీజవుతుండడంతో ఎక్కడ అజిత్ సినిమా ముందు విజయ్ మూవీ తగ్గిపోతుందో.. అజిత్ అభిమానుల ముందు తాము తల దించుకోవాల్సి వస్తుందో అని విజయ్ ఫ్యాన్స్ ఒకింత ఆందోళనతో ఉన్నారు.
ఇలాంటి టైంలో ‘వారిసు’ టీం విజయ్ ఫ్యాన్స్‌కు పెద్ద ట్రీట్ ఇచ్చింది. ‘తీ దళపతీ’ అంటూ ఈ సినిమా నుంచి కొత్త పాటను లిరికల్ వీడియో రూపంలో రిలీజ్ చేసింది. ఫైర్ బ్యాక్‌డ్రాప్‌లో విజయ్‌కి ఎలివేషన్ ఇస్తూ ఈ పాటను చిత్రీకరించిన విధానం విజయ్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన లిరికల్ వీడియోలన్నీ ఒకెత్తయితే.. ఇది ఇంకో లెవెల్ అన్నట్లుగా ఉంది. ఇంత ఖర్చు పెట్టి భారీ స్థాయిలో తీసిన లిరికల్ వీడియోలు అరుదుగా కనిపిస్తాయి. ఈ పాటను మరో స్టార్ హీరో శింబు పాడడమే కాదు.. ఈ లిరికల్ వీడియోలో కూడా స్టెప్పులేశాడు.
‘వారిసు’ చిత్రానికి కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్ కాగా.. ఈ లిరికల్ వీడియో కోసం జీకే విష్ణును ప్రత్యేకంగా తీసుకున్నారు. ఆయనే ఈ పాటను విజువలైజ్ చేసి చాలా స్టైలిష్‌గా, లావిష్‌గా తెరకెక్కించాడు. ఇందులో విజయ్‌ను ప్రెజెంట్ చేసిన విధానం.. ఆయనకు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేవు. తమిళ లిరిక్స్ సైతం విజయ్ ఫ్యాన్స్‌కి ట్రీట్ అన్నట్లే ఉన్నాయి. ఈ లిరికల్ వీడియోలో విజయ్‌తో పాటు సంగీత దర్శకుడు తమన్, లిరిసిస్ట్ వివేక్ కూడా కనిపించారు. ఈ పాట తర్వాత విజయ్ అభిమానులు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు.
This post was last modified on December 6, 2022 2:20 pm
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…