Movie News

నాని పంట పండినట్లే

నేచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు అంత మంచి ఫాంలో లేడు. అతడి చివరి సినిమా ‘అంటే సుందరానికీ’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. దాని కంటే ముందు వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ హిట్టయినా.. అంతకుముందు వచ్చిన టక్ జగదీష్, వి నిరాశ పరిచాయి. ఇప్పుడు నాని ఆశలన్నీ ‘దసరాా’ మీదే ఉన్నాయి. ఐతే హీరోగా కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నా.. నిర్మాతగా మాత్రం నాని ఫుల్ హ్యాపీ అనే చెప్పాలి.

పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు వస్తున్నాయి నిర్మాతగా నానికి. అతను ‘అ!’ అనే విభిన్నమైన సినిమా ద్వారా నిర్మాతగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా విమర్శల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ కాకపోయినా.. నానికి నష్టమైతే తెచ్చిపెట్టలేదు. నాని ప్రొడక్షన్లో వచ్చిన రెండో ‘హిట్’ దాంతో పోలిస్తే బెటర్‌గా పెర్ఫామ్ చేసింది. కానీ పెద్ద కమర్షియల్ సక్సెస్ అయితే కాలేదు.

ఇక తన అక్కను దర్శకురాలిగా పరిచయం చేస్తూ నాని తీసిన ‘మీట్ క్యూట్’ను లాభానికే సోనీ లివ్ వాళ్లకు అమ్మారు. నిర్మాతగా నాని తొలి మూడు చిత్రాలు అతడి అభిరుచిని చాటి చెప్పాయి. ఇప్పుడు నాని నుంచి వచ్చిన ‘హిట్-2’ నిర్మాతగా అడికి అతి పెద్ద సక్సెస్‌ను అందించినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే నాని నుంచి వచ్చిన మూడు సినిమాలు ఎంత ఆదాయం తెచ్చాయో.. దాన్ని మించి ఒక్క ‘హిట్-2’ రెవెన్యూ తెచ్చి పెడుతోంది. ఈ సినిమాను ఆల్రెడీ మంచి లాభాలకు అమ్మేశాడు నాని.

సినిమాకు మంచి టాక్ రావడంతో ఇతర భాషల్లోనూ డిమాండ్ ఏర్పడింది. డబ్బింగ్ వెర్షన్ కోసం అడుగుతున్నారు. ఆ పనులు చకచకా కానిస్తున్నాడు నాని. ఇతర భాషల నుంచి వచ్చేదంతా నానికి కొత్త లాభం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా పెద్ద సక్సెస్ కావడం వల్ల ‘హిట్-3’కు బంపర్ క్రేజ్ రావడం, పెద్ద స్థాయిలో బిజినెస్ జరగడం పక్కా. ఆ సినిమాకు హీరో కం ప్రొడ్యూసర్ తనే కాబట్టి నాని జాక్‌పాట్ కొట్టినట్లే.

This post was last modified on December 4, 2022 2:32 pm

Share

Recent Posts

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

23 minutes ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

8 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

9 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

9 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

9 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

10 hours ago