కొందరు హీరోయిన్లకు అనుకోకుండానే చాలా అరుదైన కాంబోలు దొరుకుతాయి. కావాలని ప్లాన్ చేసింది కాకపోయినా అలా కుదిరిపోతుంది. ఒకే బ్యానర్ లో ఇద్దరు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి బాలకృష్ణలతో వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలో వాళ్లకు జోడిగా నటిస్తున్న శృతి హాసన్ కు అలాంటి ఆఫరే వచ్చింది. కానీ ఆ సినిమాల ఫస్ట్ లిరికల్ వీడియో వీడియోలు వచ్చి చెరో పది మిలియన్ల వ్యూస్ దాటేసినా ఆమె నుంచి ఎలాంటి ట్వీట్ కానీ స్పందన కానీ లేదు. ఆ పాటల్లో లేకపోవచ్చు కానీ మొత్తం మూవీలో కథానాయిక తనే కాబట్టి ఏదో రూపంలో రెస్పాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ కామెంట్
సరే ప్రమోషన్లకో ప్రీ రిలీజ్ ఈవెంట్ కో వస్తుందనుకుంటే దానికన్నాముందు ఇంకా పాటల షూటింగ్ బ్యాలన్స్ ఉందట. చెరో డ్యూయెట్ పూర్తి చేయాల్సి ఉందని కాకపోతే నెల రోజుల టైం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఒకరికి హ్యాండ్ ఇవ్వొచ్చనే టాక్ కూడా గట్టిగా ఉంది. అందుకే కంపోజ్ చేయించిన ఆల్బమ్స్ లో ముందు అది రిలీజ్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. గోపీచంద్ మలినేనితో వరసగా సినిమాలు చేసిన దృష్ట్యా అతనికి సహకరిస్తుందా లేక చిరుతో మళ్ళీ జట్టు కట్టే ఛాన్స్ వస్తుందో లేదోనని మెగాస్టార్ కు మొగ్గు చూపుతుందా చూడాలి. లేదూ బాలయ్యదీ వదులుకోకూడదంటే నెలంతా హైదరాబాద్లో ఉంటే సరి.
ఒకప్పుడు విజయశాంతి రాధ లాంటి వాళ్ళు ఇలా చిరంజీవి బాలకృష్ణలతో ఒకేసారి ఆడిపాడేవాళ్లు. కానీ తర్వాత ఎవరికీ అలా కుదరలేదు. ఇన్నేళ్ల తర్వాత శృతి ఆ ఛాన్స్ కొట్టేసింది. కాకపోతే ఇప్పటిదాకా బయటికి కనిపించలేదు. జనవరి 12 వీరసింహారెడ్డి, 13న వాల్తేర్ వీరయ్య రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది కానీ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. వారసుడు అఫీషియల్ గా 12ని లాక్ చేసుకుంది. అజిత్ తునివు ఈ రోజో రేపో ఫైనల్ చేస్తారు. ప్రమోషన్ల పరంగానూ స్పీడ్ పెంచాలి కాబట్టి శృతి హాసన్ ఈ నెలలో సగమైనా అందుబాటులో ఉండటం చాలా అవసరం.
This post was last modified on December 1, 2022 11:54 am
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…