‘పుష్ప’ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు తొలిసారి అనౌన్స్ చేసినపుడు.. ఇది పేరుకే పాన్ ఇండియా మూవీ అనుకున్నారు చాలామంది. మహా అయితే బన్నీకి కేరళలో ఫాలోయింగ్ ఉంది అక్కడ ఆడొచ్చేమో అనుకున్నారే తప్ప.. మిగతా భాషల్లో ఈ సినిమా సత్తా చాటుతుందని అంచనా వేయలేదు. అందులోనూ రిలీజ్ రోజు డివైడ్ టాక్ రావడంతో తెలుగులో అయినా సినిమా అనుకున్నట్లుగా ఆడుతుందనే అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ చిత్రం తెలుగును మించి ఇతర భాషల్లో విజయవంతం అయింది.
హిందీలో అయితే అసాధారణ వసూళ్లతో బ్లాక్‌బస్టర్ స్టేటస్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో బన్నీ డైలాగ్స్, మేనరిజమ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. యూరప్‌లో జరిగే ఫుట్‌బాల్ లీగ్స్‌లో, యుఎస్‌లో డబ్ల్ల్యూడబ్ల్యూఈ పోటీల్లో బన్నీ మేనరిజమ్స్‌ను అనుకరించారంటే ఈ సినిమా రీచ్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ‘పుష్ప-2’ షూట్ జరుగుతుండగా.. ‘పుష్ప’ సినిమా రష్యా భాషలో పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధం అవుతుండడం విశేషం. డిసెంబరు 8న ఈ చిత్రం రష్యన్‌లో రిలీజ కానుంది. డిసెంబరు 1న రష్యా రాజధాని మాస్కోలో, 3న పీటర్స్‌బర్గ్‌లో ఈ ‘పుష్ప’కు స్పెషల్ ప్రిమియర్స్ కూడా వేయబోతున్నారు. బన్నీ, సుకుమార్ ఇతర టీం మెంబర్స్ ఈ ప్రిమియర్స్‌కు హాజరు కాబోతున్నారు. ఈ లోపు సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.
ఇంతకుముందు ఇండియన్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేసిన ట్రైలర్‌నే రష్యన్ భాషలో వదిలారు. కొత్తగా మార్పులు చేర్పులేమీ లేవు.
ఐతే ఒక ప్రాంతీయ చిత్రం ఇలా రష్యన్ భాషలో అనువాదం కావడం.. డైలాగులన్నీ రష్యన్‌లో వినడం మన జనాలకు చాలా కొత్తగా, ఆశ్చర్యకరంగా అనిపిస్తుందనడంలో సందేహం లేదు. ఈ సినిమా కథలో రష్యా కనెక్షన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. రష్యాలో తయారైన ఒక వస్తువుకు మూలం మన దగ్గరున్న ఎర్రచందనమే అన్నట్లు చూపిస్తారు. మరి ఈ సినిమాతో రష్యన్లు ఏమేర కనెక్టవుతారో చూడాలి.
This post was last modified on November 29, 2022 3:06 pm
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…
పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు.…
ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా…
2023 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలపబోతున్నారు. త్వరలో…
గత ఏడాది రాజకీయాల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ తీసుకున్న టైంలో ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి.…
టెక్నాలజీ రంగంలో తెలుగు ప్రజలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఐటీలో మేటి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లకు భారతీయులు……