ఇప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరోల పాత సినిమాల రీరిలీజ్ హంగామా నడుస్తోంది. ఈ ట్రెండుకు శ్రీకారం చుట్టింది తెలుగు అభిమానులే. పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి, రెబల్, బిల్లా, వర్షం, బాద్‌షా.. ఇలా గత కొన్ని నెలల్లో చాలా సినిమాలే రీ రిలీజ్ అయ్యాయి. వాటిలో పోకిరి, జల్సా సినిమాలకు నెలకొన్న సందడి అలాంటిలాంటిది కాదు. ఇప్పుడు కోలీవుడ్ అభిమానులు సైతం ఈ ఒరవడిని అందిపుచ్చుకుంటున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘బాబా’ను పెద్ద స్థాయిలో తమిళనాట రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే నెల 12న రజినీకాంత్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా తమిళనాట సందడి చేయబోతోంది. ఐతే ఈ రీ రిలీజ్‌లో కేవలం అభిమానులు మాత్రమే భాగస్వాములు కావడం లేదు. చిత్ర బృందం కూడా ఇందులో పాలుపంచుకుంటోంది. బాబా సినిమాను యాజిటీజ్ రిలీజ్ చేయకుండా దానికి కొత్త సొబగులు అద్దుతుండడం విశేషం.
‘బాబా’ను రీ ఎడిట్ చేసి, కొన్ని మార్పులు చేర్పులతో రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్తగా మళ్లీ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఆయన సినిమా కోసం నరేటర్ అవతారం ఎత్తున్నట్లు తెలుస్తోంది. రజినీ ‘బాబా’ కోసం మళ్లీ డబ్బింగ్ చెబుతున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైతం మళ్లీ ‘బాబా’ కోసం వర్క్ చేశారట. మరి ఆయన అవసరం ఎందుకొచ్చిందో? ఐతే ఈ సినిమా మీద ఇంత శ్రద్ధ పెడుతుండడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రజినీ కెరీర్లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఉండగా.. డిజాస్టర్ అయిన ‘బాబా’ను రీ రిలీజ్ చేయడమే చాలామందికి నచ్చట్లేదు. ఆ సినిమాను ఇలా మళ్లీ విడుదల చేయడమే ఎక్కువ అనుకుంటే.. మళ్లీ దాని కోసం రజినీ, ఏఆర్ రెహమాన్ కష్టపడడం ఏంటి అంటున్నారు. ఎంత చేసినా సినిమా అంతకుమించి మెరుగుపడదని.. ఇదంతా వృథా ప్రయాస అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on November 28, 2022 5:39 pm
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…