బ్లాక్ బస్టర్ కాంతార ఓటిటి కోసం రోజుల తరబడి ఎదురు చూసిన అభిమానుల నిరీక్షణకు తెరవేస్తూ గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అందులో చాలా కీలకమైన, సినిమా మొత్తానికి సోల్ గా చెప్పుకున్న వరాహ రూపం పాట స్థానంలో వేరొకటి ఉండటం ప్రేక్షకులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. కారణం కాపీ రైట్ ఇష్యూ కింద తాయ్ కుద్దమ్ బ్రిడ్జ్ నిర్మాతలు వేసిన కోర్టు కేసు. తమ గీతాన్ని యథాతధంగా వాడుకుని కనీసం చెప్పలేదని, రిలీజయ్యాక కూడా క్రెడిట్స్ ఇవ్వలేదని చేసిన ఆరోపణల వల్ల దాన్ని వాడకూడదని ఆదేశాలు వచ్చాయి
ఆ కారణంగానే ఎందుకిచ్చిన రిస్క్ అని ప్రైమ్ టీమ్ ఆ సాంగ్ ని తీయించేసి కొత్తది పెట్టింది. ఇది నెగటివ్ ఫీడ్ బ్యాక్ కి దారి తీసింది. తాజాగా గతంలో ఇచ్చిన నిషేధం ఉత్తర్వులు చెల్లవని, ఫిర్యాదుదారులు చేసిన అభియోగంలో సరైన చట్టబద్దత లేదని చెబుతూ కేరళలోని కోజికోడ్ కోర్టు కొత్త జడ్జ్ మెంట్ ఇచ్చింది. దీంతో ఇప్పుడా వరాహ రూపాన్ని ఓటిటిలో వాడుకోవచ్చు. అయితే అదే రాష్ట్రంలోని పాలక్కడ్ న్యాయస్థానంలో ఈ వివాదం మీద మరో కేసు నడుస్తోంది. అది కూడా హోంబాలే ఫిలింస్ కు అనుకూలంగా వస్తే అన్ని అడ్డంకులు తొలగినట్టు అవుతుంది.
ఒక పాట తాలూకు ప్రభావం సినిమా మీద ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. రెండున్నర గంటల నిడివిని ఒక్క అయిదు నిముషాలు శాశించడం అరుదుగా జరుగుతుంది. అందులోనూ కాంతార లాంటి నేటివిటీ ప్రధానమైన చిత్రాలకు ఇది ఇంకా కీలకం. ఏదైతేనేం మొత్తానికి సమస్య పరిష్కారమయ్యింది. వ్యూస్ పరంగా ఓటిటిలోనూ ఇది రికార్డులు సాధిస్తుందన్న అంచనాలున్నాయి. అయితే కెజిఎఫ్ 2 మీద కూడా ఇదే తరహా హైప్ ఉన్నప్పుడు అది డిజిటల్ లో ఆర్ఆర్ఆర్ ని దాటలేకపోయింది. కనీసం ఇండియా వైడ్ అయినా కాంతార అది సాధిస్తుందేమో చూడాలి.
This post was last modified on November 25, 2022 10:03 pm
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. మాములుగా అయితే విశ్వక్…
బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే…
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…