వరుస ఫ్లాప్స్ వచ్చాయని నితిన్ ఒక ఏడాది పాటు విరామం తీసుకున్నాడు. ఆ ఏడాది లోటు భర్తీ చేయడానికి ఒకే సారి చాలా సినిమాలు మొదలుపెట్టాడు. భీష్మ సినిమాతో నితిన్ కి మళ్ళీ విజయం దక్కింది. అయితే జూన్ లో విడుదల కావాల్సిన రంగ్ దే షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. చంద్రశేఖర్ ఏలేటితో మరో సినిమా కూడా నితిన్ మొదలు పెట్టాడు.
అది కాకుండా అందాధూన్ రీమేక్ కూడా మొదలు పెట్టేసాడు. ఇన్ని సినిమాలు మొదలై వేర్వేరు దశలలో ఉన్నాయంటే అది చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం. అన్ని సినిమాలకు వడ్డీలు పెరుగుతున్నాయి. అదీ కాక ఇప్పుడు షూటింగ్స్ మళ్ళీ మొదలయ్యాక అన్నిటినీ ముందుకు నడిపించే తలనొప్పి ఒకటి.
అలాగే రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలనే డిమాండ్ ఉంది కనుక నితిన్ ఈ సినిమాలు అన్నిటికీ పారితోషికం తగ్గించుకోవాలి. ఏకకాలంలో పలు సినిమాలు పూర్తి చేయాలని నితిన్ వేసుకున్న ప్లాన్ బెడిసికొట్టాయి ఇప్పుడు తనకు పరి పరి విధాలుగా నష్టాలు తెచ్చి పెడుతోంది. అందుకే నాని, నాగ చైతన్య మాదిరిగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళితే ఈ తలనొప్పులు ఉండవు.
This post was last modified on July 15, 2020 3:43 pm
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…
టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…