లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్నా, వందల మంది ప్రాణాలు కోల్పోతున్నా, మాకేమి అవుతుందిలే అనే లెక్కలేనితనం ఇంకా చాలా మందిలో ఉంది. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం కనుక కరోనా వచ్చే అవకాశమే లేదని భావించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో దాదాపు అందరికీ కరోనా పాజిటివ్ రావడంతో దేశమంతా అప్రమత్తత పెరిగింది.
అసలు బయటకు అడుగు పెట్టాల్సిన అవసరమే లేని, సకల భోగాలు ఉన్న బిగ్ బి కుటుంబం అసలు ఎలా కరోనా బారిన పడింది? అంటే అది రావడానికి ఎంత అవకాశం ఉందనేది అందరికీ అర్ధమయింది. అందుకే ఇంత కాలం ఏమీ కాదులే అని షూటింగ్స్ చేసేసిన వాళ్ళు కూడా ఇప్పుడు రూటు మార్చారు. బిగ్ బీకే వస్తే మనమెంత అంటూ ఇంటికే పరిమితం అవుతున్నారు.
టీవీ ప్రోగ్రామ్స్, సీరియల్స్ షూటింగ్ కూడా నిలిచిపోనుంది. బతికుంటే బలుసాకు తినవచ్చు, కరోనా వెళ్ళిపోయాక రెండు షిఫ్టులు కష్టపడి సంపాదించుకోవచ్చు అనుకుంటూ సినిమా, టీవీ రంగాల్లో దాదాపు తొంభై శాతం మంది డిసైడ్ అయిపోయారు. ఒక్క పెద్ద సెలెబ్రిటీకి వ్యాధి సోకితే అది ఎంతమందికి కనువిప్పు అయిందనేది ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది కదూ.
Gulte Telugu Telugu Political and Movie News Updates