10.. 15.. 16.. 11.. 18.. 15.. 13.. ఈ అంకెలు ఏమీ ప్రముఖ క్రికెటర్ సాధించిన వరుస మ్యాచ్ లలో సాధించిన పరుగులు కాదు. ఒక నటుడు హీరోగా ఏడేళ్లలో నటించిన సినిమాలు. ఏడాదికి ఒక సినిమా తీయటానికే కిందా మీదా పడే ఈ రోజుల్లో అందుకు భిన్నంగా అగ్రహీరోగా పేరున్న క్రిష్ణ ప్రతి ఏడాది పదికి తగ్గకుండా నటించటం ఆయనకు మాత్రమే సాధ్యం. ఎనిమిదేళ్ల పాటు ఆయన ఈ రేంజ్ లో సినిమాల్లో నటించిన తీరు చూస్తే.. ఆయన ఎంతలా కష్టపడేవారో ఇట్టే అర్థమవుతుంది.
ఒక దశలో ఆయన నటించిన ప్రతి సినిమా ఇరవై రోజులకు ఒకటి చొప్పున విడుదలయ్యేది. సినీ అభిమానులకు అంతకుమించిన పండుగ లాంటి వార్త ఇంకేం ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అన్నట్లుగా మొదలైన ఆయన సినిమాల పరంపర 1968 నుంచి మొదలైంది. తన మొదటి సినిమా విడుదలైన మూడేళ్లకే ఇంత భారీగా సినిమాలు చేయటం.. మరే హీరోకు సాధ్యం కాదనే చెప్పాలి. వరుస పెట్టి ఇన్ని సినిమాలు కాకున్నా.. మధ్యలో భారీగా సినిమాలు చేసిన హీరోగా బాలక్రిష్ణకు పేరుంది.
1968 సంవత్సరంలో క్రిష్ణ నటించిన సినిమాలు ఏకంగా పది. ఆ తర్వాతి సంవత్సరం (1969)లో 15 సినిమాలు నటించారు. 1970లో 16 సినిమాలు.. 1971లో 11 సినిమాలు.. 1972లో 18 సినిమాలు.. 1973లో 15 సినిమాలు.. 1974లో 13 సినిమాల్లో నటించారు. అలా ఏడేళ్ల వ్యవధిలో ఏకంగా 98 సినిమాలు నటించిన రికార్డు ఆయనకు సొంతం. ఆ తర్వాత మళ్లీ 1980లో ఒకే ఏడాదిలో 17 సినిమాల్లో నటించి సరిరారు నాకెవ్వరు అన్న విషయాన్ని తన సినిమాల రిలీజ్ తో చెప్పేశారని చెప్పాలి.
ఏళ్లకు ఏళ్లు ఇన్నేసి సినిమాలు ఇంత నిర్విరామంగా చేయాలంటే ఎంత కష్టమన్నది చెప్పొచ్చు. తాను ఒప్పుకున్న సినిమాల్ని ఎవరికి ఇబ్బంది కలగకుండా పూర్తి చేసేందుకు మూడు షిఫ్టుల్లో పని చేసేవారు. ఆయనలో కష్టపడే గుణంతో పాటు.. సాహస నిర్ణయాలకు వెనుకాడేవారు కాదు. ఇలాంటి హీరో తెలుగు సినిమాకే కాదు.. భారతీయ సినిమాలో మరొకరు ఉండరనే చెప్పాలి.
This post was last modified on November 15, 2022 10:01 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…