టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం సిద్ధ మైంది. సుదీర్ఘ దూరం.. సుదీర్ఘ కాలం చేయనున్న ఈ పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేయడం.. వైసీపీని అధికారం నుంచి తప్పించడం అనే రెండు కీలక అంశాలనే ప్రధాన అజెండా చేసుకుని నారా లోకే ష్ ముందుకు సాగనున్నారు. వాస్తవానికి తాను పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్టు ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడు వేదికగానే లోకేష్ ప్రకటించారు.
తొలుత చంద్రబాబు పాదయాత్ర చేస్తారని అనుకున్నారు. ఆతర్వాత.. కొన్నాళ్లకు.. లోకేష్ పాదయాత్ర చేయడం ఖాయమని మీడియాకు ఉప్పందించారు. అయితే.. గత నాలుగు మాసాలుగా ఈ విషయం చర్చలకే పరిమితమైంది. అయితే తాజాగా దీనిపై రూట్ మ్యాప్ రెడీ అయితే.. ఈరోజో రేపో దీనిని మీడియాకు విడుదల చేయనున్నారు. అదేసమయంలో అనుమతి కోసం ప్రభుత్వానికి కూడా అర్జీ పెట్టనున్నారు.
ఇక, ప్రస్తుతం అందించిన సమాచారం ప్రకారం షెడ్యూల్ ఏంటంటే.. నారా లోకష్ జనవరి 27న తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఆ రోజు ఉదయం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నారా లోకేష్‌కు ఆయన మాతృమూర్తి నారా భువనేశ్వరి వీర తిలకం దిద్ది హారతి ఇచ్చి.. ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ.. చివరకు ఇచ్ఛాపురం వరకు సాగనుంది. ఈ యాత్రలో గ్రామాలను టచ్ చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను లోకేష్ ఎండగట్టనున్నారు.
అదేసమయంలో పార్టీని బలోపేతం చేసేలా నిత్యం తమ్ముళ్లతో సమావేశాలు పెడతారు. విరామమెరుగని బాటసారి మాదిరిగా.. నారా లోకేష్ ఆసాంతం నిర్వహించే ఆ పాదయాత్ర వచ్చే 2024 ఎన్నికలకు మూడు లేదా నాలుగు మాసాల ముందు ముగియనుంది. ప్రతి రోజూ 25 నుంచి 30 కిలో మీటర్ల దూరం లోకేష్ నడవనున్నారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. వారి సమస్యలు వింటూ ఈ యాత్ర ముందుకు సాగుతుంది. దీనికి పార్టీ నేతలు..ఆయా జిల్లాల్లో ఏర్పాట్లు చూడాల్సి ఉంటుందని పార్టీ నుంచిఇప్పటి ఒక సెర్క్యులర్ వచ్చినట్టు తెలుస్తోంది.
This post was last modified on November 11, 2022 2:23 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…