కొన్ని కొన్ని ఇంటర్యూల్లో ఇద్దరిద్దరు గెస్టులు వస్తుంటారు. ఆ ఇద్దరూ ఎవరూ అనే కాంబినేషన్ మీద కరణ్ జోహార్ వంటి హోస్ట్‌లు చాలా వర్కవుట్ చేస్తారు. అదే తరహాలో మన దగర కూడా అన్‌స్టాపబుల్ కోసం ఏ ఇద్దరినీ కలిపి పిలుస్తారా అనే ఆసక్తి చాలానే నెలకొంది. ఇప్పుడు కమెడియన్ ఆలి హోస్ట్ చేసే ‘ఆలితో సరదాగా’ ప్రోగ్రమ్‌పైన కూడా అటువంటి ఆసక్తే ఉంది. కాని ఈ ప్రోగ్రామ్ లేటెస్ట్ ఎపిసోడ్‌కు విచ్చేసిన ఇద్దరు గెస్టుల కాంబినేషన్ మాత్రం షాకిచ్చింది.
తల్లి పాత్రలు చేసే సీనియర్ నటీమణి అండ్ మాజీ హీరోయిన్ తులసి.. అలాగే ప్రభాస్ అసిస్టెంట్ గా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యి.. తరువాత యాక్టర్‌గా బిజీ అయిపోయిన ప్రభాస్ శ్రీను ఈ కార్యక్రమానికి కలసి గెస్టులుగా విచ్చేశారు. ”అప్పట్లో డార్లింగ్ సినిమా చేశాం కదా.. అప్పుడు ఈవిడ తగిలింది” అంటూ శ్రీను కామెంట్ చేయడంతో.. అసలు ఏ ఉద్దేశ్యంతో మనోడు ఆ కామెంట్ చేశాడా.. అని అందరూ నోళ్ళెళ్లబెడతున్నారు. వీళ్లిద్దరూ ఫ్రెండ్సా? లేదంటే యాక్టర్ అండ్ మేనేజర్ టైప్ ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ ఏదన్నా ఉందా? అంటూ ఇప్పుడు ఆ ప్రోమో చూశాక చాలా సందేహాలు వచ్చేస్తున్నాయి. అసలు 55 ఏళ్ళ తులసీకి 43 ఏళ్ళ ప్రభాస్ శ్రీనుకు ఉన్న కనక్షన్ ఏంటి.. వాళ్ళిద్దరినీ ఆలీ ఎందుకు కలిపి ఇంటర్యూ చేశాడనేది మాత్రం ఇప్పుడు ట్రెండ్ అవుతున్న హాట్ టాపిక్.
ఏదేమైనా కూడా కమెడియన్ ఆలీ మాట్లాడితే ఆ రూమర్ రాసుకోండి ఈ రూమర్ రాసుకోండి అంటూ సెటైర్లు వేస్తుంటాడు కాని, చివరకు తను కూడా రూమర్లకు ఊతమిచ్చే కాంబినేషన్లు సెట్ చేస్తున్నాడు. ఎందుకంటే సెన్సేషన్ క్రియేట్ చేస్తే సక్సెస్ అవుతాడనే ఫార్ములా ఆయనకు బాగా తెలుసు.
This post was last modified on November 10, 2022 5:29 pm
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…
తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయాలపై ఆసక్తికర…
ప్రస్తుతం విదేశీ విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏపీ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అమెరికా, ఉక్రెయిన్, రష్యా సహా..…
టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…