నా గురించి చాలా నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారు, కాని తట్టుకుని నిలబడతా, అనుకున్నది సాధిస్తానంటూ ఇనస్టాగ్రామ్‌లో హీరోయిన్ రష్మిక మందన్నా ఒక పెద్ద పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు నిజంగా ట్రోల్స్ వచ్చినప్పుడో లేదంటే ఆమె సినిమాల రిలీజ్ టైములోనో ఎంత ట్రోలింగ్ జరిగినా కూడా స్పందించని ఈ కన్నడ బ్యూటి, ఇప్పుడు సడన్‌గా ఎందుకు అంత పెద్ద పోస్ట్ పెట్టిందనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటారు?
నిజానికి బాలీవుడ్ లో మన సౌత్ స్టారీమణులు.. చాలా పెద్ద సినిమాలు చేసినప్పుడో లేదంటో ఏదన్నా పెద్ద హిట్ కొట్టినప్పుడో పాపులర్ అవుతారు. అయితే రష్మిక మాత్రం అక్కడ ఒక్క సినిమా కూడా కొట్టకుండానే ఇనస్టాగ్రామ్‌లో 35 మిలియన్ పైచిలుకు ఫాలోవర్స్‌ను సంపాదించింది. పుష్ప సినిమాతో తొలిసారి అక్కడ హిట్ చవిచూసినా కూడా, డైరక్ట్ హిందీ మూవీ గుడ్ బాయ్ ఫ్లాప్ అయినా కూడా చేతిలో మరో నాలుగున్నాయ్. ఈ తరుణంలో చాలా మ్యాగజైన్స్ ఆమె ఫోటోల గురించి ఎగబడటం, ఆమె బికినీల్లో అందాలను ఆరబోయడం జరిగిపోయాయ్.
కాకపోతే ఈ మొత్తం వ్యవహారం గురించి బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండను బాగా వాడుకుంటోందని చాలా బాలీవుడ్ వెబ్ సైట్లలో సడన్‌గా ఆర్టికల్స్ పడటం స్టార్ట్ అయ్యాయ్. అలాగే అక్కడ కూడా చాలామంది రష్మిక విజయ్‌ను వాడేసుకుని పెద్ద ప్రొడక్షన్ కంపెనీలో భలే ఛాన్సులు పట్టేస్తోందే అంటూ సెటైర్లు వేస్తున్నారట. అందుకే ఇప్పుడు గాసిప్స్ బాధిస్తున్నాయ్ అంటూ రష్మిక వాపోయినట్లుంది.
మరో ప్రక్కన ఏంటంటే.. అసలు రష్మిక గురించి బయట సాలిడ్ గా ఒక్క కాంట్రోవర్షియల్ రూమర్ కూడా ఏదీ చెక్కర్లకొట్టడంలేదు.. ఈ టైములో నా మీద నెగెటివిటీ వస్తోంది అంటూ అటెన్షన్ కోసం ప్రయత్నిస్తోందా అని కూడా కొన్ని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఎప్పుడూ న్యూస్‌లో ఎలా ఉండాలో సమంత అండ్ కంగనా రనౌత్ తరహాలో ఇప్పుడు రష్మిక కూడా బాగా నేర్చేసుకుంది.
This post was last modified on November 10, 2022 9:08 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…