ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ అయ్యాక తాము కూడా దానికి తీసిపోని సినిమాలు ఇస్తామని బీరాలు పోయిన బాలీవుడ్ బ్రహ్మాస్త్ర, కోలీవుడ్ పొన్నియన్ సెల్వన్ 1 కనీసం దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేక అయిదు వందల కోట్ల లోపే వసూళ్లతో సరిపెట్టుకున్నాయి. రాజమౌళి చేసిన మల్టీ స్టారర్ మేజిక్ దేశదేశాలు దాటి ఆస్కార్ ముంగిట ఉంది. అమెరికా, జపాన్, యుకె, ఆస్ట్రేలియా ఎక్కడ షోలు వేసినా భాషతో సంబంధం లేకుండా ఒకటే రచ్చ చేసింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ హిందీ వెర్షన్ వచ్చాక అంతర్జాతీయ స్థాయిలో ట్రిపులార్ కు దక్కిన ప్రశంసలు భవిష్యత్తులో మళ్ళీ జక్కన్న తప్ప ఎవరూ అందుకోలేరు.
పిఎస్ 1 టైంలో తెలుగు మీడియాతో పాటు ఆడియన్స్ పబ్లిక్ టాక్స్ లో యావరేజ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు అరవ ఫ్యాన్స్ చేసిన అతి అంత ఇంత కాదు. అక్కడి జర్నలిస్టులు సైతం తమ ట్విట్టర్ హ్యాండిల్స్ లో అక్కసు వెళ్లగక్కారు. కట్ చేస్తే తెలుగు హిందీలో పొన్నియన్ చేసిన అద్భుతాలు ఏమీ లేవు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. పోనీ థియేటర్ లో మిస్ అయినవాళ్ళు ఇప్పుడు చూసి ఆహా ఓహో అంటున్నారా అంటే అదీ లేదు. పర్లేదు కానీ మరీ నాలుగు వందల కోట్లు దీనికి ఎలా వచ్చాయనే కోణంలోనే ప్రశ్నలు సంధిస్తున్నారు. పిఎస్ ప్రతాపమంతా తమిళనాడు వరకే.
ఇక బ్రహ్మాస్త్ర పార్ట్ 1 కేసు కూడా ఇంచుమించు ఇలాంటిదే. మొదటి పది రోజులు ఒకటే ఊదరగొట్టిన నార్త్ బ్యాచ్ అందులో గ్రాఫిక్స్ గురించి అతిశయోక్తిగా చెప్పుకున్నారు రీసెంట్ గా డిస్నీ హాట్ స్టార్ లో వచ్చేసింది. దీనికీ ఆహా ఓహో బిగ్ స్క్రీన్ మీద మిస్సయ్యామే లాంటి పొగడ్తల వర్షం కురవడం లేదు. కెజిఎఫ్ 2 ప్రైమ్ లో వచ్చినప్పుడు ఎలాగైతే సోసోగా రెస్పాన్స్ తెచ్చుకుందో బ్రహ్మాస్త్ర, పీఎస్ 1లకూ అదే జరిగింది. కానీ ఆర్ఆర్ఆర్ మాత్రం థియేటర్, డిజిటిల్ రెండు చోట్లా భీభత్సం సృష్టించింది. రస్సో బ్రదర్స్ లాంటి వాళ్లే ట్రిపులార్ ని మెచ్చుకున్నప్పుడు దాన్ని టచ్ చేయడం అంత సులభమా
This post was last modified on November 10, 2022 3:31 pm
మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ను వివిధ భాషల్లో లాంచ్ చేశారు.…
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…