స్టార్ హీరోయిన్లు, పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్టులకు చాలా వరకు భాషా పరమైన హద్దులు ఉండవు. వాళ్లు పలు భాషల్లో ఈజీగా సినిమాలు దక్కించుకుంటారు. కానీ హీరోలు చాలా వరకు ఒక భాషకే పరిమితం అవుతుంటారు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండు వల్ల వారికి బహు భాషల్లో గుర్తింపు వస్తోంది. ఇక కమెడియన్ల విషయానికి వస్తే.. వాళ్లు అనువాద చిత్రాల ద్వారా వేరే భాషల్లోకి వెళ్తారు తప్ప.. ఇతర భాషల వాళ్లు పిలిచిన అవకాశాలు ఇవ్వడం తక్కువే.
కమెడియన్లు రాణించడంలో భాష కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి.. ఆయా భాషల్లోనే వారికి ఎక్కువ పేరు వస్తుంటుంది. అందుకే ఒక భాషకు చెందిన కమెడియన్‌ను ఇంకో భాషకు చెందిన సినిమాల కోసం పిలవడం అరుదుగానే జరుగుతుంటుంది. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ కమెడియన్‌గా ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత హీరోగా మారి.. ఆ స్టింట్ ముగిశాక తిరిగి కామెడీ, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సునీల్.. ఇప్పటిదాకా వేరే భాషల్లో నటించింది లేదు.
ఐతే ఇప్పుడు సునీల్‌కు ఒక పెద్ద తమిళ చిత్రంలో అవకాశం దక్కింది. ఇటీవలే ‘ప్రిన్స్’ మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన శివ కార్తికేయన్ కొత్త చిత్రం ‘మావీరన్’లో సునీల్ కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రం ‘మహావీరుడు’ పేరుతో ఒకసారి తెలుగులోనూ తెరకెక్కుతోంది. ఇంతకుముందు తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో ‘మండేలా’ అనే సినిమా తీసిన మడోన్నా అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో స్టార్ డైరెక్టర్ శంకర్ తనయురాలు అదితి శంకర్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో సునీల్‌కు ఒక ముఖ్య పాత్ర దక్కింది. అతణ్ని తమ ప్రాజెక్టులోకి ఆహ్వానిస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.
సునీల్ పాత్ర తెలుగు, తమిళం రెండు వెర్షన్లలోనూ ఉంటుందని సమాచారం. మరి తమిళంలో మన కమెడియన్‌కు ఎలాంటి వెల్కం దక్కుతుందో చూడాలి. ఇటీవలే ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలో సునీల్ తన కామెడీతో అలరించాడు. హీరో వేషాలు వదిలేసి మళ్లీ కామెడీ రోల్స్ చేశాక కుదురుకోవడానికి సునీల్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఈ మద్య అతడి కామెడీ బాగానే వర్కవుట్ అవుతోంది.
This post was last modified on November 9, 2022 1:49 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…