తోటి యాంకర్ విష్ణుప్రియతో తనకు విభేదాలున్నట్లు వచ్చిన వార్తలను ఢీ జోడీ యాంకర్ వర్షిణి ఖండించింది. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విష్ణుప్రియ గురించి ఆమె మాట్లాడింది. మీకు విష్ణుప్రియతో విభేదాలున్నట్లు రకరకాల రూమర్లు వినిపిస్తుంటాయి.. వాటిపై ఏమంటారు అని అడిగితే.. అలాంటిదేమీ లేదని, ఇలాంటి వార్తలు ఎందుకొస్తాయో తెలియదని వర్షిణి అంది. అలాగే మరో యాంకర్ శ్రీముఖితో విభేదాలంటూ వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించింది. ఐతే వీళ్లిద్దరితో తనకు పెద్దగా స్నేహం లేదని కూడా ఆమె స్పష్టం చేసింది. హాయ్, బాయ్ చెప్పుకునే వరకే వారితో స్నేహం ఉన్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం తెలుగులో ఉన్న యాంకర్లకు ర్యాంకులు ఎలా ఇస్తారని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. సుమకు నంబర్ వన్ ర్యాంకు ఇచ్చింది వర్షిణి. ఆ తర్వాత వరుసగా ఝాన్సీ, శ్రీముఖి, రష్మి, అనసూయల పేర్లు చెప్పి తర్వాతి స్థానాన్ని తనకు ఇచ్చుకుంది. చివరగా విష్ణుప్రియ పేరు చెప్పింది. విష్ణుప్రియ పేరు చివర్లో చెప్పారేంటి అని అడిగితే.. చివరి స్థానం నాకు ఇచ్చుకోమంటారా అని వర్షిణి నవ్వుతూ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే విష్ణుప్రియతో విభేదాల గురించి ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. అదంతా ఏమీ లేదని స్పష్టం చేసింది వర్షిణి. కొన్ని సినిమాల్లో నటించినా బ్రేక్ అందుకోలేకపోయిన వర్షిణి.. ప్రస్తుతం బుల్లితెరకే పరిమితం అయిపోయింది.
This post was last modified on July 13, 2020 7:28 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…