మామూలుగా ఏడాది మొత్తంలో అన్ సీజన్ ఏది అంటే ఒకప్పుడు ఫిబ్రవరి-మార్చి నెలలనే చెప్పేవారు. అప్పుడు సినిమాలకు మహరాజ పోషకులైన యూత్ అంతా పరీక్షల్లో మునిగిపోయి ఉంటారు కాబట్టి సినిమాలకు సరైన కలెక్షన్లు ఉండవు. ఐతే కరోనా టైం నుంచి పరిస్థితి మారుతోంది.
చదువులు, పరీక్షల షెడ్యూళ్లన్నీ అటు ఇటు అవడం.. మధ్య మధ్యలో థియేటర్లు మూతపడడం వల్ల గత రెండేళ్ల నుంచి ఫిబ్రవరిలో పెద్ద పెద్ద సినిమాలను కూడా రిలీజ్ చేసేస్తున్నారు. అదే సమయంలో నవంబరు నెల బాగా డల్లుగా తయారవుతోంది. ఈ నెలలో సినిమాలు పెద్దగా ఆడట్లేదు. వసూళ్లు రాబట్లేదు. పేరున్న సినిమాలు ఈ నెలను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు.
అక్టోబరులో దసరాకు పెద్ద సినిమాలు రిలీజవతున్నాయి. తర్వాత డిసెంబరు మీద దృష్టిసారిస్తున్నారు. నవంబరు నెలంటే మాత్రం భయపడుతున్నారు. ఈ నెలకు ముందు అనుకున్న సినిమాలన్నింటినీ ఒక్కొక్కటిగా వాయిదా వేసుకుంటూ పోతున్నారు. ఊర్వశివో రాక్షసివో, యశోద మినహాయిస్తే ఈ నెలలో నోటెడ్ రిలీజెస్ ఏమీ ఉండేలా లేవు.
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, అహింస, హంట్ సహా చాలా సినిమాలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వాటి గురించి ఉన్నట్లుండి హడావుడి ఆగిపోయింది. కొన్నేళ్ల నుంచి నవంబరులో పెద్ద హిట్లేవీ లేకపోవడంతో ఈ నెలను అన్ సీజన్‌గా పరిగణిస్తున్నట్లున్నారు. ‘ఊర్వశివో రాక్షసివో’ మంచి టాక్ తెచ్చుకుని కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టకపోగా.. ‘యశోద’ పరిస్థితి ఏమవుతుందో చూడాలి. అది కూడా డల్లుగానే నడిస్తే నవంబరు భయాలు ఇంకా పెరిగిపోవడం ఖాయం.
This post was last modified on November 9, 2022 10:23 am
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…