Movie News

రౌడీ పరిస్థితి ఇలా అయ్యిందేంటి?

తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చాలా ఏళ్ల తర్వాత ‘ఖైదీ’ సినిమాతో స్టార్ అయ్యానని, కానీ విజయ్ దేవరకొండ చాలా వేగంగా అలాంటి ఇమేజ్ సంపాదించాడని మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడు స్టేట్మెంట్ ఇచ్చాడంటే విజయ్ ఎదుగుదల ఎలాంటిది అన్నది అర్థం చేసుకోవచ్చు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ట్యాక్సీవాలా లాంటి వరుస హిట్లతో అతను చాలా తక్కువ సమయంలో పెద్ద స్టార్ అయిపోయాడు. పాన్ ఇండియా లెవెల్లో అతడికి మంచి పేరు, ఫాలోయింగ్ వచ్చాయి.

వీటిని సరిగ్గా ఉపయోగించుకుని ఉంటే విజయ్ ఇంకా పెద్ద రేంజికి వెళ్లేవాడు. పాన్ ఇండియా సూపర్ స్టార్లలో ఒకడయ్యేవాడు. కానీ వరుసగా తప్పటడుగులు వేసి ఇప్పుడు టాలీవుడ్లో కూడా తన కెరీర్ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితికి చేరుకున్నాడు. పూరి జగన్నాథ్‌ను నమ్మి ‘లైగర్’ లాంటి సినిమా చేయడం పెద్ద తప్పయితే.. ఆ సినిమా కోసం చాలా టైం వెచ్చించడం, అలాగే విషయం లేని సినిమా గురించి అతిగా మాట్లాడడం మరింతగా అతడికి చేటు చేశాయి.

విజయ్‌కి ఒకేసారి పరిస్థితులు కూడా ఎదురు తిరుగుతుండడం విచారకరమైన విషయం. ‘లైగర్’ గాయాలను మాన్పేలా ‘ఖుషి’ సినిమాతో మ్యాజిక్ జరుగుతుందని ఆశిస్తుంటే సమంత అనారోగ్యం పాలై ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఫిబ్రవరికి అనుకున్న సినిమా కాస్తా వేసవికో, ఆ తర్వాత ఇంకెప్పటికో వాయిదా పడేలా ఉంది. సుకుమార్‌తో ఇంతకుముందు ఘనంగా సినిమా అనౌన్స్ అయితే చేశారు కానీ.. ఆయన విజయ్ కోసం ఖాళీ చేసుకునేలా కనిపించడం లేదు. ఒక దశలో త్రివిక్రమ్ సైతం విజయ్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడట. కానీ ఆయన కూడా ఇప్పుడు విజయ్‌తో సినిమా చేసే సంకేతాలు ఎంతమాత్రం కనిపించడం లేదు.

మధ్యలో విజయ్ దగ్గరిక కొన్ని మంచి స్క్రిప్టులు వచ్చినా.. తనకున్న కమిట్మెంట్ల దృష్ట్యా కథలు వినడానికి కూడా అతను ఆసక్తి చూపించలేదని, విన్నవాటికి కూడా నో చెప్పాడని సమాచారం. ఇప్పుడేమో ‘ఖుషి’ ఆగిపోయి.. వెంటనే మరో సినిమా ఏదీ మొదలుపెట్టలేని స్థితిలో ఇబ్బంది పడుతున్నాడు. తనకిలాంటి పరిస్థితి వస్తుందని విజయ్ ఊహించి ఉండకపోవచ్చు.

This post was last modified on November 6, 2022 8:21 pm

Share

Recent Posts

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

6 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

21 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

22 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

4 hours ago