ఇప్పటికే సంక్రాంతి రేస్ నుంచి ఆది పురుష్ ని తప్పించినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ బాగా కోపంగా ఉన్నారు. సరే ఏదో గ్రాఫిక్స్ వర్క్ అంటున్నారు కాబట్టి క్వాలిటీ ముఖ్యం లెమ్మని సర్దుకున్నారు. మార్చి 30న శ్రీరామనవమిని టార్గెట్ చేసుకుని రిలీజ్ ఖాయం చేస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే అప్పుడు కూడా సాధ్యమయ్యేలా లేదని ముంబై టాక్. పోస్ట్ ప్రొడక్షన్ ఆపేసి విఎఫెక్స్ వర్క్ కు సంబంధించి కొత్తగా మళ్ళీ పనులు మొదలుపెడతారట. టీజర్ కు వచ్చిన కంప్లయింట్స్ ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన మేరకు మొత్తం సిజి మళ్ళీ చేయించాలని నిర్ణయించుకున్నట్టు వినికిడి.
ఇందుకుగాను వంద కోట్లు అదనంగా టి సిరీస్ సంస్థ కేటాయించినట్టు ఫిలింనగర్ టాక్. ఈసారి హడావిడి పడకుండా మొత్తం ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకుని రాజమౌళి లాంటి ఇండస్ట్రీలోని అతి ముఖ్యులకు ప్రీమియర్ వేసి వాళ్ళ ద్వారా వచ్చే జెన్యూన్ ఫీడ్ బ్యాక్ ని బట్టి డేట్ అనౌన్స్ ఎప్పుడు చేయాలో డిసైడ్ చేస్తారట. ఇదంతా జరగాలంటే 2023 వేసవి సరిపోదు. ఇంకా ఎక్కువ టైం కావాలి. ప్రభాస్ సైతం రాజీ పడొద్దని తేల్చి చెప్పడంతో అభిమానులను తాత్కాలికంగా సంతృప్తి పరచడం కోసం విడుదల చేసి నెగటివిటీ మూటగట్టుకోవడం కంటే నెమ్మదిగా వెళ్లి బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడమే ప్రధానమని గుర్తించారు.
ఒకవేళ ఇదే కనక జరిగితే ఆది పురుష్ ని దసరాకో దీపావళికో చూడాల్సి ఉంటుంది. లేదూ 2024 సంక్రాంతికి వెళ్లాలంటే అప్పుడేం పరిస్థితులు ఉంటాయో చెప్పలేం. ఎందుకంటే ప్రభాస్ సినిమా ఉందని తెలిసి కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మార్కెట్ చేసుకునే చిరంజీవి బాలకృష్ణలే వెనక్కు తగ్గలేదు అలాంటిది మరోసారి ఇదే సిచువేషన్ రిపీట్ అయితే ఓపెనింగ్స్ కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే ఆరు నూరైనా సోలో రిలీజ్ కే ఆది పురుష్ టీమ్ మొగ్గు చూపుతోంది. సరిగా కట్ చేయని టీజర్ వంద కోట్ల భారాన్ని మోపిందనుకోవాలా లేక వందల కోట్ల నష్టాన్ని ముందే కంట్రోల్ చేసిందని భావించాలా. లెట్ సీ
This post was last modified on November 5, 2022 10:24 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…