సరైన హిట్లు పడక నాని లాగా స్టార్ ఇమేజ్ సంపాదించలేకపోయాడు కానీ.. టాలెంట్ పరంగా అతడికి ఏమాత్రం తీసిపోడు సత్యదేవ్. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో అతను తన ప్రతిభను చాటుకున్నాడు. గత నెల దసరా కానుకగా రిలీజైన గాడ్ ఫాదర్ మూవీలో మెగాస్టార్ చిరంజీవినే డామినేట్ చేసే పెర్ఫామెన్స్ ఇచ్చాడు సత్యదేవ్. తాజాగా బాలీవుడ్ మూవీ రామ్ సేతులోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.
ఐతే సోలో హీరోగా మాత్రం సత్యదేవ్‌కు సరైన హిట్ పడట్లేదు. చివరగా గాడ్సే సినిమాలో అదిరే పెర్ఫామెన్స్ ఇచ్చిన సత్యదేవ్‌కు సక్సెస్ మాత్రం దక్కలేదు. అంతకుముందు కూడా సోలో హీరోగా అతడికి పరాజయాలే ఎదురయ్యాయి. ఇక సత్యదేవ్ నటించిన మరో చిత్రం గుర్తుందా శీతాకాలం విడుదలకే నోచుకోవడం లేదు. అయినా సరే.. సత్యదేవ్ సోలో హీరోగా ప్రయత్నాలు ఆపడం లేదు. దాదాపు అరడజను చిత్రాలు అతడి చేతిలో ఉన్నాయి.
తాజాగా సత్యదేవ్ ఒక వెరైటీ మూవీ అనౌన్స్ చేశాడు. ఈ సినిమా టైటిల్.. ఫుల్ బాటిల్ కావడం విశేషం. టైటిల్‌ను కూడా బాటిల్ తరహాలోనే డిజైన్ చేశారు. టైటిల్ లోగో కూడా భలే వెరైటీగా ఉంది. టైటిల్‌ను బట్టి చూస్తే సినిమా మందుకొట్టడం చుట్టూ కామెడీగా సాగేలా కనిపిస్తోంది. తమిళంలో ఇలాంటిదే వా క్వార్టర్ కటింగ్ అనే సినిమా ఒకటి వచ్చింది. మరి దానికి ఇదేమైనా రీమేకో ఏమో తెలియదు.
నిఖిల్‌తో కిరాక్ పార్టీ, సత్యదేవ్‌తో తిమ్మరసు చిత్రాలను రూపొందించిన శరణ్ కొప్పిశెట్టి ఈ చిత్రానికి దర్శకుడు. అతనే ఈ చిత్రానికి రచయిత కూడా. రామాంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నవంబరు 2న లాంచ్ చేయబోతున్నారు. టైటిల్ లోగోతో ఆకట్టుకున్న చిత్ర బృందం.. ఫస్ట్ లుక్‌తో ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఏదో కొత్తగా ట్రై చేస్తున్న సత్యదేవ్ ఈ సినిమాతో అయినా సోలో హీరోగా హిట్ కొడతాడని ఆశిద్దాం.
This post was last modified on November 1, 2022 11:45 am
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…