మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన Chiranjeevi 154కి ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టే Waltair Veerayya టైటిలే ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు రెండున్నర నిమిషాలకు దగ్గరగా ట్రైలర్ లాంటి టీజర్ ని విడుదల చేశారు. కాకపోతే నిమిషం దాకా కేవలం ఎలివేషన్ తో సరిపెట్టేసి చివరిలో ఊర మాస్ షాట్స్ తో ఫ్యాన్స్ కి నిజంగానే పూనకాలు తెప్పించారు. టైటిల్ కార్డు దగ్గర రవితేజతో దీపావళి విషెస్ చెప్పించి త్వరలో కలుద్దాం అని ముగించడం బాగుంది. సంక్రాంతికి రావడం మీద ఏ మాత్రం సందేహాలు ఉన్నా వాటిని పటాపంచలు చేస్తూ పొంగల్ ని లాక్ చేశారు.
ఇక వీడియోలో కంటెంట్ పూర్తిగా మాస్ కి గూస్ బంప్స్ తెప్పించే విధంగా చూపించాడు దర్శకుడు బాబీ. ఎప్పుడో ముఠామేస్త్రి, అందరివాడు తరువాత ఆ టైపులో పంచకట్టు, చేతిలో బీడీ, గాగుల్స్ తో మెగా విశ్వరూపం మాములుగా లేదు. ఇటీవలే ఆచార్య, గాడ్ ఫాదర్ లో చాలా సీరియస్ రోల్స్ లో ఆశించిన స్థాయిలో స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వలేకపోయిన చిరంజీవి ఇందులో మాత్రం రచ్చ చేసేలానే ఉన్నారు. పోటీలో బాలకృష వీరసింహారెడ్డికి గట్టి పోటీ ఇచ్చే కంటెంట్ నే సిద్ధం చేసినట్టు విజువల్స్ ని బట్టి చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విన్నట్టే అనిపించినా బాగుంది.
మెగాభిమానులకు పండక్కు సరైన కానుకే ఇచ్చారు. పోస్టర్ లో ఈ గెటప్ తో పాటు చిరంజీవి తల మీద పోలీస్ టోపీ గట్రాలు పెట్టి చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఇప్పటికే రవితేజ ఖాకీ డ్రెస్సులో కనిపిస్తాడని లీక్ ఉన్న నేపథ్యంలో వీటికి లింక్ ఏంటనే డౌట్ రావడం సహజం. ఒకపక్క విజయ్ వారసుడు పొంగల్ ని కన్ఫర్మ్ చేసుకుంటూ కొత్త పోస్టర్ వచ్చేసింది. సో ఆది పురుష్ తో కలుపుకుని మొత్తం నాలుగు పందెం పుంజులు దూకడం ఖరారైపోయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన వాల్తేర్ వీరయ్యలో శృతి హాసన్ హీరోయిన్ కాగా పెద్ద క్యాస్టింగ్ నే సెట్ చేసుకున్నాడు బాబీ
This post was last modified on October 24, 2022 11:32 am
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…