బాహుబలి, ఆర్ఆర్ఆర్ లతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్పిల్ బర్గ్ రాజమౌళి ఎప్పుడెప్పుడు మహేష్ బాబు సినిమా మొదలుపెడతారా అని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికింకా చాలా టైం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ చిన్న లీకైనా సరే విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కలిగిస్తోంది. పైకి పనులేం జరుగుతున్నట్టు కనిపించడం లేదు కానీ జక్కన్న మాత్రం ఆల్రెడీ క్యాస్టింగ్ విషయంలో తీవ్ర కసరత్తులు మొదలుపెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా ఆయన సినిమాల్లో హీరోతో సమానంగా విలన్లు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో తెలిసిందే.
ఇప్పుడు దీనికి కూడా అలాంటి మాస్టర్ ప్లాన్ వేశారట. మహేష్ కు ధీటుగా ఇందులో రెండు ప్రతినాయక పాత్రలుంటాయి. అందులో ఒకదాని కోసం కార్తీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వినికిడి. లైన్ విన్న తమిళ స్టార్ హీరో పాజిటివ్ గానే స్పందించాడని, ఇప్పుడు దీన్ని వదులుకుంటే మళ్ళీ రాజమౌళితో చేసే అవకాశం వస్తుందో రాదోనన్న ఆలోచనతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెన్నై టాక్. అయితే అధికారికంగా కన్ఫర్మ్ గా చేయలేదు కానీ ఇదంతా అనఫీషియలే. కార్తీ గతంలో నాగార్జునతో ఊపిరి చేశాడు. దాని హిట్ లో కీలక భాగస్వామ్యం వహించాడు. ఇప్పుడు మహేష్ తో జట్టు కడితే అంచనాలు డబులవుతాయి.
హీరోగా మంచి స్వింగ్ లో ఉన్న టైంలో కార్తీ విలన్ గా చేస్తాడానే సందేహం రావొచ్చు కానీ రాజమౌళి డిజైన్ చేసిన పాత్ర వేరే స్థాయిలో ఉందట. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ఎంటర్ టైనర్ ఏ జానరనే లీక్ స్పష్టంగా బయటకి రాలేదు. ఒకసారి ఇండియానా జోన్స్ తరహాలో ఫారెస్ట్ అడ్వెంచర్ అంటారు, మరోసారి జేమ్స్ బాండ్ టైపులో స్పై థ్రిల్లర్ అంటారు. ఏది కరెక్టో తెలియాలంటే మాత్రం ఇంకో అయిదారు నెలలు ఎదురు చూడక తప్పదు. ఆలోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమా పూర్తి చేసి ప్రిన్స్ ఫ్రీ అవుతాడు. ఆ తర్వాత రాజమౌళి కోసం ఎన్నేళ్లు త్యాగం చేయాలో.
This post was last modified on October 13, 2022 9:03 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ…
పోలవరం ప్రాజెక్టు… ఏపీకి జీవనాడి. జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే…
అంతా సిద్దమనుకుని ఇంకాసేపట్లో షోలు పడతాయన్న టైంలో హఠాత్తుగా విడుదల ఆగిపోతే ఆ నిర్మాతలు పడే నరకం అంతా ఇంతా…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేతృత్వంలోని గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ ఏపీకి వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు ఇప్పటికే…
ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్స్ గురించి సోషల్ మీడియా మంచి…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. తెలంగాణ…