Movie News

మంచు విష్ణు మంచి నిర్ణయం

టాలీవుడ్లో చాలా పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. అనుకున్న స్థాయిలో నిలదొక్కుకోలేక ఇబ్బంది పడుతున్నారు మంచు ఫ్యామిలీ వారసులు. ఒక దశలో మంచు విష్ణు, మంచు మనోజ్ అడపా దడపా బాగానే హిట్లు ఇచ్చారు కానీ.. గత కొన్నేళ్లలో వారి సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. దీంతో వాళ్ల కెరీర్లో గ్యాప్ వచ్చింది. మంచు మనోజ్ అయితే నాలుగైదేళ్లుగా కొత్త సినిమా సంగతే తేల్చట్లేదు.
మంచు విష్ణు మాత్రం మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. చకచకా జిన్నా అనే సినిమా చేశాడు. అది విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ తర్వాత చేయాల్సిన సినిమాలకు సంబంధించి డిస్కషన్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర ప్రాజెక్టు గురించి సమాచారం బయటికి వచ్చింది. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ అనే వెరైటీ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మలయాళంలో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ ఒకటి. ఇందులో వయసు మళ్లిన తండ్రి కోసం విదేశాల నుంచి అతడి కొడుకు ఒక రోబోను పంపిస్తాడు. దాంతో ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిపోయిన తండ్రి.. చివరికి దాన్ని వదులుకోలేక పడే తపన.. ఈ క్రమంలో ఒక ఆసక్తికర ముగింపుతో సినిమా ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో తండ్రి పాత్రను మోహన్ బాబుతో చేయించి కొడుకు క్యారెక్టర్లో మంచు విష్ణు కనిపించనున్నాడ.

ఆల్రెడీ తమిళంలోనూ ఈ చిత్రం రీమేక్ అయి మంచి ఫలితాన్నే అందుకుంది. మోహన్ బాబు స్థాయికి తగని పాత్రల్లో ఆయన్ని చూసి నిరాశ చెందిన అభిమానులకు ఇది కచ్చితంగా మంచి న్యూసే. ఆయనకు ఈ పాత్ర కచ్చితంగా వైవిధ్యంగా ఉంటుంది. ఆయనలోని నటుడికి మంచి స్కోప్ ఇచ్చే పాత్ర అవుతుందిది. విష్ణుకు కూడా ఇదొక భిన్నమైన సినిమా అవుతుంది. ఇలాంటి సెన్సిబుల్ మూవీస్ చేయకే మంచు వారు గాడి తప్పారని చెప్పాలి. మరి ఈ చిత్రాన్ని తెలుగులో ఎంత బాగా తీసి మెప్పిస్తారో చూడాలి.

This post was last modified on October 12, 2022 2:49 pm

Share

Recent Posts

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

26 seconds ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

5 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

13 hours ago