Movie News

‘పుష్ప’లో ఆ డైలాగ్ వెనుక హరీష్ శంకర్

ఇండియన్ ఫిలిం హిస్టరీలో ‘పుష్ప’ అనే సినిమాది ఒక ప్రత్యేక అధ్యాయం. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ సినిమాల తరహాలో విడుదల ముంగిట దానికి పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా క్రేజ్ ఏమీ లేదు. తెలుగులో మాత్రమే హైప్ కనిపించింది. కానీ తెలుగులో రిలీజ్ తర్వాత డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను ఇతర భాషల వాళ్లు ఆదరించిన తీరు అనూహ్యం. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా పెను సంచలనమే రేపింది. నామమాత్రంగా విడుదలై రూ.100 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజమ్స్, డైలాగ్స్, ఇందులోని పాటలు అంతర్జాతీయ స్థాయిలో ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. తాజాగా ‘పుష్ప’ 2021 సంవత్సరానికి ఫిలిం ఫేర్ అవార్డులను దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. అనేక విభాగాల్లో అవార్డులు అందుకుంది. దీనికంటే ముందు ‘సైమా’ అవార్డుల్లోనూ ‘పుష్ప’ ఎలా ఆధిపత్యం చలాయించిందో తెలిసిందే.

కాగా ‘సైమా’ అవార్డుల వేడుకను ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటూ ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన డైలాగ్‌కు సంబంధించి సీక్రెట్ వెల్లడించాడు. అవార్డు అందుకున్న సందర్భంగా కమెడియన్ ఆలీ బన్నీకి ఒక ఫ్లవర్ ఇచ్చి వెళ్లాడు. వాట్ ఎ కోఇన్సిడెన్స్ అంటూ వేదిక మీదే ఉన్న హరీష్ శంకర్ ‘పుష్ప’లో ఒక డైలాగ్‌కు ఎలా కారణమయ్యాడో వెల్లడించాడు బన్నీ.

‘పుష్ప’ టైటిల్ అనౌన్స్ చేశాక హరీష్ శంకర్‌ను తాను కలిసినపుడు ఇంత పెద్ద సినిమాకు ‘పుష్ప’ అంటూ పువ్వును సూచించే సాఫ్ట్ టైటిల్ ఏంటి అని అడిగాడని.. ఇదే విషయాన్ని తాను సుకుమార్ దగ్గర ప్రస్తావించగా.. ఆడియన్స్‌కు కూడా ఇలాంటి సందేహం వస్తుందేమో.. కాబట్టి ‘‘పుష్ప అంటే ప్లవర్ అనుకున్నావా.. ఫైర్’’ అని మనమే డైలాగ్‌తో చెప్పేద్దాం అంటూ అప్పటికప్పుడు సుక్కు ఈ డైలాగ్ చెప్పినట్లు బన్నీ వెల్లడించాడు. ఈ రకంగా హరీష్ పరోక్షంగా ఈ డైలాగ్‌కు కారణమైన విషయాన్ని బన్నీ వెల్లడించాడు.

This post was last modified on October 10, 2022 4:42 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

6 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago