ప్రభాస్ నుంచి రాబోతున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’కు సంబంధించి రెండు రోజుల కిందే టీజర్ లాంచ్ ఘనంగా చేశారు. కానీ టీజర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ తేడా కొట్టడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ‘రామాయణం’ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించింది ఒకటి. టీజర్లో చూపించింది ఇంకోటి. హాలీవుడ్లో తెరకెక్కిన పలు సినిమాలు, వెబ్ సిరీస్‌ల ఛాయలు ఇందులో కనిపించాయి.
గేమ్ ఆఫ్ థ్రోన్స్, ప్లానెట్ ఆఫ్ ఏప్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాంటి వాటి నుంచి విజువల్ ఎఫెక్ట్స్‌ను కాపీ కొట్టి సీన్లు తీర్చిదిద్దినట్లుగా అనిపించింది. కొన్ని చోట్ల ఎఫెక్ట్స్ మరీ పేలవంగా అనిపించాయి. దీంతో నెటిజన్లు ఒక రేంజిలో సినిమాను ట్రోల్ చేస్తున్నారు రెండు రోజుల నుంచి. కాగా టీజర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ ‘వీఎఫెక్స్ వాలా’ అనే ట్విట్టర్ పేజీని ట్యాగ్ చేయడం గమనార్హం.
ఈ వీఎఫెక్స్ వాలా అనేది బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్‌కు చెందినది. అతడితో ఓం రౌత్ ‘తానాజీ’ అనే బ్లాక్‌బస్టర్ మూవీ తీశాడు. ఆ చిత్రానికి వీఎఫెక్స్ వాలా సంస్థ పని చేసింది. ‘ఆదిపురుష్’ టీజర్ ట్వీట్‌లో ఆ సంస్థను ట్యాగ్ చేయడంతో ఈ సినిమాకు కూడా ఆ సంస్థే ఎఫెక్ట్స్ అందించందని నెటిజన్లు భావించారు. ఇవేం చీప్ గ్రాఫిక్స్.. ఇలా కాపీ కొట్టేశారంటి అంటూ వాళ్లను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో అజయ్ దేవగణ్ సంస్థ ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది.
‘ఆదిపురుష్’ సినిమాకు తాము పని చేయలేదని, ఆ చిత్రంతో తమకు ఏ సంబంధం లేదని తేల్చేసింది. ట్రోలింగ్ తట్టుకోలేకే ఆ సంస్థ ఇలా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐతే ‘వీఎఫెక్స్ వాలా’ ఈ సినిమాకు పని చేయకున్నా ఓం రౌత్ వాళ్లను ఎందుకు ట్యాగ్ చేశాడన్నది అర్థం కాని విషయం. ఏదేమైనా ‘ఆదిపురుష్’ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయాన్ని మాత్రం చిత్ర బృందం అర్థం చేసుకుని రిలీజ్ లోపు కొంచెం దిద్దుబాటు చర్యలు చేపడితే బెటరేమో.
This post was last modified on October 4, 2022 6:21 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…