“నేను రాజకీయాలకు దూరం అయ్యా కానీ.. రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు”.. తన కొత్త చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఒక డైలాగ్. ట్రైలర్ లాంచ్ కంటే ముందు చిరు ఆ డైలాగ్‌తో ఒక ఆడియో ట్వీట్ వేస్తే.. మీడియాలో చిన్నపాటి కలకలం రేగింది. అది సినిమా కోసం చెప్పిన డైలాగ్ అని అర్థం చేసుకోకుండా కొన్ని మీడియా ఛానెళ్లు.. చిరు మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నాడా అంటూ పెద్ద పెద్ద డిస్కషన్లు పెట్టేశాయి. ఈ డైలాగ్ ట్రైలర్లో వినిపించాక కూడా ఈ చర్చలు ఆగలేదు.
ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో మీడియాను కలిసిన చిరుకు విలేకరుల నుంచి ఈ డైలాగ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. సినిమాలో ఇలాంటి పొలిటికల్ డైలాగుంటాయా.. వీటి ద్వారా ఎవరినైనా టార్గెట్ చేస్తున్నారా అని ప్రశ్నించగా.. చిరు అలాంటిదేమీ లేదని తేల్చేశాడు. ఉద్దేశపూర్వంగా సినిమాలో పొలిటికల్ సెటైర్లేమీ పెట్టలేదని చిరు స్పష్టం చేశాడు.
‘గాడ్ పాదర్’ సినిమాలో డైలాగులన్నీ దాని మాతృక ‘లూసిఫర్’ ఆధారంగానే ఉంటాయని.. ఐతే ఇందులోని పొలిటికల్ డైలాగులకు ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేమీ చేయలేనని చిరు అన్నాడు. తాను రాజకీయాల నుంచి నిష్క్రమించి ప్రస్తుతం సైలెంటుగా ఉంటున్నట్లు చిరు తెలిపాడు. భవిష్యత్తులో తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తాను మద్దతు ఇస్తాననే సంకేతాలను చిరు ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ నిబద్ధత ఏంటో తనకు తెలుసని.. ఆంధ్రప్రదేశ్‌కు అంకిత భావం ఉన్న నాయకుడు అవసరం అని.. ఆ అవకాశాన్ని ప్రజలు పవన్‌కు ఇస్తారనే భావిస్తున్నానని చిరు తెలిపాడు పవన్ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని, అతను మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని చిరు వ్యాఖ్యానించాడు. ‘లూసిఫర్’ సినిమాతో తనతో రీమేక్ చేయలన్న ఆలోచన తన కొడుకు రామ్ చరణ్‌దే అని చెప్పిన చిరు.. ఈ కథలో దర్శకుడు మోహన్ రాజా చేసిన పెద్ద మార్పు వల్ల తనకు తృప్తి కలిగిందని అన్నాడు.
This post was last modified on October 4, 2022 6:14 pm
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…
కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…
డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్లైన్ రైతు బజార్‌ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…
సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…
అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…