‘ఆదిపురుష్’ సినిమాలో రావణుడి పాత్రకు సైఫ్ అలీ ఖాన్‌ను ఎంచుకున్నట్లు వార్త బయటికి వచ్చినపుడే చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక ముస్లిం నటుడితో ఈ పాత్రను చేయించడం ఏంటనే ప్రశ్న ఓ వర్గం నుంచి ఎదురైంది. దీనికి తోడు రావణుడిని ఇందులో గొప్పగా చూపించబోతున్నట్లు సైఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి.
అవన్నీ పక్కన పెడితే ప్రభాస్ లాంటి కటౌట్ ముందు రావణుడిగా సైఫ్ ఏమాత్రం సెట్టవుతాడో అన్న సందేహాలు కూడా కలిగాయి. ఇవేమీ పట్టించుకోకుండా చిత్ర బృందం ముందుకు వెళ్లిపోయింది. ఈ చిత్రంలో సైఫ్ ఎలా కనిపిస్తాడనే సంకేతాలు ఇప్పటిదాకా ఏమాత్రం ఇవ్వలేదు. నిన్న రిలీజ్ చేసిన టీజర్‌తోనే అతడి అవతారం బయటికి వచ్చింది. అది చూసి జనాలు షాకైపోతున్నారు. ఇతనేం రావణుడయ్యా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులైతే రావణుడి పాత్రలో సైఫ్‌ను అసలు చూడలేకపోతున్నారనే చెప్పాలి.
రావణుడి పాత్రను మన దగ్గర మహా మహా నటులు పోషించారు. ముఖ్యంగా ఎస్వీ రంగారావు, ఎన్టీరామారావు ఆ పాత్రను ఎంత గొప్పగా పోషించారో అందరికీ తెలిసిందే. రావణుడు అనగానే వారి రూపాలే కళ్ల ముందు కదలాడుతాయి. బేసిగ్గా రావణుడు రాక్షసుడైనప్పటికీ.. ఆ పాత్ర మీద ఒక ఆపేక్ష కలిగే స్థాయిలో దాన్ని ఆ ఇద్దరూ పండించారు.
రావణుడు అనగానే మనవాళ్లు ఊహించుకునే రూపానికి.. సైఫ్ కనిపించిన తీరుకు అసలు పొంతనే లేదు. వ్యక్తిగతంగా సైఫ్ నేపథ్యానికి తోడు.. అతడి లుక్ చూసి రావణుడు ఎప్పుడు ఇస్లాంలో చేరాడు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అతడికి మోడర్న్ కటింగ్ చేయించి.. సైడ్ కట్స్ పెట్టించి.. గడ్డం కూడా ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు స్టైలింగ్ చేయించి ఏమాత్రం రుచించని అవతారంలోకి మార్చారు. ఈ సినిమా కోసం బోలెడన్ని టెస్ట్ షూట్‌లు చేశామని చెప్పుకున్న దర్శకుడు ఓం రౌత్.. అసలు ఈ లుక్‌ను ఎలా ఫైనలైజ్ చేశాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సినిమాను దెబ్బ కొట్టడానికి ఈ సైఫ్ లుక్ ఒక్కడు చాలంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ నెగెటివిటీని ‘ఆదిపురుష్’ టీం ఎలా తట్టుకుంటుందో చూడాలి.
This post was last modified on October 3, 2022 3:08 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…