Movie News

సడన్ గా ‘సింగిల్’ అంటున్న రాక్ స్టార్

ఆల్మోస్ట్ 2002లో ఖడ్గం సినిమాలో లైమ్ లైట్లోకి వచ్చిన టాప్ కంపోజర్ దేవిశ్రీప్రసాద్.. ఆ తరువాత ఈ రెండు దశాబ్దాల్లో దాదాపు స్టార్ హీరోలందరికీ సినిమాలు చేశాడు. తన మ్యూజిక్ తో యావత్ తెలుగు లోకాన్ని ఉర్రూతలూపేశాడు. అయితే ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా సినిమాలకు కాకుండా సొంతంగా ఒక్క పాట కూడా చేసిందేలేదు. అందుకే ఇప్పుడు తన ఫస్ట్ సింగిల్ సాంగుతో రాబోతున్నట్లు ప్రకటించాడు దేవిశ్రీప్రసాద్.

నిజానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్లందరూ.. ఒక ప్రక్కన సినిమాలు చేస్తూనే.. మరో ప్రక్కన సింగిల్స్ కూడా రిలీజ్ చేస్తుంటారు. ఈ ఇండివిడ్యుయల్ మ్యూజిక్ వీడియోలకు కూడా మిలియన్స్ వ్యూస్ మాత్రమే కాదు.. రకరాలు ఆడియో ఆప్స్ లో కూడా విపరీతమైన ఆదరణ ఉంటుంది. పైగా.. ఒక సినిమాకు పాటలు ఇచ్చేస్తే.. దానికి తాలూకు రైట్స్ అన్నీ సదరు ప్రొడ్యూసర్లకు సదరు ఆడియోను కొనుక్కున్న కంపెనీలకు మాత్రమే ఉంటాయి. ఆ పాటల తాలూకు విజయాన్ని అందులో నటించిన హీరోలకే అప్పజేస్తారు మన ఫ్యాన్స్. కాని ఒక ఆడియో కంపెనీతో కలసి నేరుగా ఇలా సింగిల్ సాంగ్ చెయ్యడం వలన, ఆర్టిస్టుకే రైట్స్ ఎక్కువ ఉండే ఛాన్సుంటుంది. ఆ పాటలను వాళ్ళు హ్యీపీగా పబ్లిక్ కాన్సర్ట్ లో పాడుకోవచ్చు.. వివిధ విదేశీ కంపెనీలకు కూడా రైట్స్ విక్రయించుకోవచ్చు. పైగా క్రెడిట్ అంతా సోలోగా ఆ కంపోజర్ కే వస్తుంది. ఈ బిజినెస్ అంతా మాకెందుకులో అని తెలుగులో చాలామంది సంగీత దర్శకులు కేవలం సినిమాలకే పరిమితం అవుతుంటారు. దేవిశ్రీ కూడా ఇన్నాళ్ళూ అలాగే పరిమితం అయిపోయాడు.

కాకపోతే పుష్ప సినిమా బాలీవుడ్లో విజయం సాధించిన తరువాత.. టి-సిరీస్ కంపెనీవాల్ళు మనోడ్ని బాగానే లైన్లో పెట్టేశారు. ఆల్రెడీ 3-4 హిందీ సినిమాలు కాకుండా, మనోడితో ఇప్పుడు సింగిల్ సాంగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట. అవన్నీ దేవిశ్రీప్రసాద్ సొంత యుట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తారో లేకపోతే టి-సిరీస్ ఛానల్ లో రిలీజ్ చేస్తారో తెలియదు కాని, మన రాక్ స్టార్ మాత్రం కొత్త ‘సింగిల్’ ఇన్నింగ్స్ స్టార్ట్ చెయ్యడానికి చాలా ఎక్సయింటింగా ఉన్నట్లో సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

This post was last modified on September 30, 2022 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

12 minutes ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

7 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

8 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

8 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

9 hours ago