ఇంకో వారం తిరక్కుండానే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లు బరిలో దిగబోతున్నాయి. ఎన్నడూ లేనిది చిరంజీవి, నాగార్జునలు ఒకేరోజు బాక్సాఫీస్ క్లాష్ కు సిద్ధపడటంతో దసరా పండగ అక్టోబర్ 5న రసవత్తరమైన పోటీ కనిపించనుంది. ఆల్రెడీ థియేటర్లతో ఒప్పందాలు దాదాపుగా జరిగిపోయాయి. పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు అడ్వాన్సులిచ్చేసి స్క్రీన్లను బ్లాక్ చేసుకుంటున్నారు. ఎవరికి వారు వీలైనంత మంచివి దక్కేలా పావులు కదుపుతున్నారు. రెండు సినిమాల వెనుక బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉండటంతో నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఈ కౌంట్ మీద రేపు పొన్నియన్ సెల్వన్ 1 టాక్ కూడా కీలకం కానుంది.
ఇక అసలు విషయానికి వస్తే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లలో ఆసక్తికరమైన ఓ పోలిక ఉంది. రెండు కథల్లో మెయిన్ పాయింట్ సిస్టర్ సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. మొదటిదాంట్లో నయనతార పోషించిన పాత్ర చిరంజీవికి చెల్లి వరసలో సాగుతుంది. చనిపోయిన సిఎం కూతురిగా చెడ్డవాడైన భర్తను దాటలేక పద్మవ్యూహంలో చిక్కుకున్న ఆమెను కాపాడేందుకు ఇరవై సంవత్సరాలు ఆ కుటుంబానికి దూరంగా ఉన్న మెగాస్టార్ సరైన టైంలో ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని, సోదరిని కాపాడేందుకు రంగంలో దిగుతాడు. వీళ్ళ మధ్య బలమైన సీన్స్ ఉంటాయి.
అటు ది ఘోస్ట్ సంగతి చూస్తే ఎప్పుడో దూరమైన అక్కయ్య (గుల్ పనాగ్) శత్రువుల వల్ల ప్రమాదంలో ఉంటే చనిపోయిన తండ్రికిచ్చిన మాట కోసం ఏజెంట్ విక్రమ్ అలియాస్ నాగార్జున ఆమెతో పాటు మేనకోడలిని రక్షించే బాధ్యత తీసుకుంటాడు. గరుడవేగాను మించిన యాక్షన్ టేకింగ్ తో దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పటికే విభిన్న అనుభూతి ఇవ్వబోతున్నామని హామీ ఇచ్చేశాడు. ఫైట్లు ఎన్ని ఉన్నా హీరో పోరాటం మాత్రం అక్కయ్యను కాపాడుకోవడం మీదే ఉంటుంది. మొత్తానికి గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లలో ఈ సారూప్యత ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.
This post was last modified on September 29, 2022 7:57 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…