షారుఖ్ ఖాన్ చివరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ‘జీరో’ అనే సినిమా మీద చాలా ఆశలే పెట్టుకుంటే అది కింగ్ ఖాన్‌ను బాక్సాఫీస్ దగ్గర ‘జీరో’ను చేసింది. షారుఖ్ కెరీర్లో ఇంతకుముందు కూడా ఫ్లాపులున్నాయి కానీ.. ఈ పరాజయం మాత్రం ఆయన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ సినిమా విడుదలైన ఇంత కాలానికి కూడా షారుఖ్ తన కొత్త సినిమాను ఖరారు చేయలేదు.
ఈ ఏడాదిన్నరలో షారుఖ్ తర్వాతి సినిమా గురించి రకరకాల రూమర్లు వచ్చాయి. ఏదో సౌత్ సినిమా రీమేక్‌లో నటిస్తాడని.. అట్లీతో సినిమా ఉంటుందని.. రాజ్ కుమార్ హిరాని షారుఖ్ ను డైరెక్ట్ చేయబోతున్నాడని.. ఇంకా రకరకాల ప్రచారాలే జరిగాయి. ఐతే ఏదీ ఖరారవ్వలేదు. తాజాగా ట్విట్టర్లో అభిమానులతో ముఖాముఖి సందర్భంగా తాను తర్వాతి సినిమాను ఎవరితో చేస్తానో చెప్పకనే చెప్పాడు షారుఖ్.
హాలీవుడ్ దర్శకుల్లో మార్టిన్ స్కోర్సీస్‌తో పని చేస్తారా.. లేక క్రిస్టఫర్ నోలన్‌తో చేస్తారా అని ఓ అభిమాని అడిగితే.. వాళ్లిద్దరినీ తాను కలిశానని. ఇద్దరూ మేటి దర్శకులే అని.. ఐతే మన దగ్గర ‘రాజ్ కుమార్ హిరాని ఉన్నాడు కదా’ అంటూ బదులిచ్చాడు షారుఖ్. అంటే తాను తర్వాతి సినిమా రాజ్ కుమార్ హిరానితోనే చేయబోతున్నానని షారుఖ్ ఈ ట్వీట్ ద్వారా చెప్పకనే చెప్పేశాడన్నమాట.
ఏడాదిన్నర కిందట ‘సంజు’ సినిమాతో పలకరించిన హిరాని.. తన కొత్త చిత్రం గురించి ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆయన ఒక్కో సినిమాకు మూడేళ్ల దాకా సమయం తీసుకుంటాడు. మిగతా హీరోల కమిట్మెంట్ల ప్రకారం చూస్తే హిరానితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నది షారుఖ్ మాత్రమే. అసలే అతడి కెరీర్ చాలా ఇబ్బందికర స్థితిలో ఉన్న నేపథ్యంలో హిరాని స్థాయికి తగ్గ సినిమాను అందిస్తే తప్ప రికవర్ కాలేడు. త్వరలోనే వీళ్ల కలయిక గురించి అధికారిక సమాచారం రావచ్చు. ఈ ఏడాది చివర్లో సినిమా పట్టాలెక్కవచ్చని భావిస్తున్నారు.
This post was last modified on April 22, 2020 1:44 pm
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి…
జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయి ఫాంటసీ మూవీగా అంచనాలు మోస్తున్న విశ్వంభర వ్యవహారం ఎంతకీ తెగక, విడుదల తేదీ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు భారీ మేలును…
ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు…
ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…
ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…