ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా దశాబ్ద కాలం తర్వాత కూడా కెరీర్ మూడు సినిమాలు ఆరు సిరీస్ లు సాగిపోవడానికి కారణం సీనియర్లతో జోడి కట్టడం, ఓటిటి ఆఫర్లకు ఎస్ చెప్పడం. అందులో భాగమే తాజాగా డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన బబ్లీ బౌన్సర్. బాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరున్న మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించడంతో దీని మీద ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ ట్రైలర్ లో లేడీ బౌన్సర్ గా తమన్నా చలాకీగా కొత్తగా కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది.
ఒరిజినల్ హిందీ వెర్షనే అయినప్పటికీ తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ డబ్బింగ్ చేసి అందుబాటులో ఉంచారు. ఓ చిన్న ఊళ్ళో ఉండే బబ్లీ తన్వర్(తమన్నా)అమ్మా నాన్న మాట జవదాటని చక్కని పిల్ల. వాళ్ళు తెచ్చిన సంబంధమే చేసుకునేందుకు నిర్ణయించుకుంటుంది. అయితే విరాజ్(అభిషేక్ బజాజ్)ని చూసి మనసు పారేసుకుని అతనికి స్వతంత్రంగా బ్రతికే అమ్మాయిలంటే ఇష్టమని తెలుసుకుని జాబ్ చేసేందుకు సిద్ధపడుతుంది. ప్రత్యేకంగా శిక్షణ పొంది ఢిల్లీకి వెళ్లి ఓ పబ్బులో బౌన్సర్ గా చేరుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు, జీవితం ఎలాంటి మలుపులు తిరగడమనేదే అసలు స్టోరీ
చాందిని బార్, ఫ్యాషన్, కార్పొరేట్, ట్రాఫిక్ సిగ్నల్ లాంటి విలక్షణ చిత్రాలతో జాతీయ అవార్డులు తీసిన మధుర్ భండార్కర్ నుంచి ఏ మాత్రం ఊహించని బిలో యావరేజ్ ప్రోడక్ట్ ఈ బబ్లీ బౌన్సర్ రూపంలో వచ్చింది. ఈ మాత్రం దాన్ని ఏ కొత్త డైరెక్టరైనా తీయగలడు. చాలా సాదాసీదాగా అనిపించే సన్నివేశాలు, ఓపికకు పరీక్ష పెట్టే ల్యాగ్ తదితర అంశాలు తమన్నా మంచి పెర్ఫార్మన్స్ ని సైతం వీక్ గా మార్చేశాయి. దీన్ని థియేటర్ లో భరించడం కష్టమని ఓటిటికి ఇచ్చారో లేక డిజిటల్ లో ఎలా ఉన్నా చూస్తారనే ధీమానో తెలియదు కానీ మొత్తానికి రక్షణగా ఉండాల్సిన బౌన్సర్ రివర్స్ లో దెబ్బ తింది.
This post was last modified on September 23, 2022 10:50 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…