కొన్నేళ్ళ క్రితం సూపర్ హిట్స్ డెలివరీ చేసిన దర్శకుల్లో సీనియర్ డైరెక్టర్ కే. విజయ్ భాస్కర్ ఒకరు. స్వయం వరం, నువ్వే కావాలి , నువ్వు నాకు నచ్చావ్ , మన్మథుడు, మల్లీశ్వరి ఇలా ఆయన తీసిన సూపర్ హిట్ ఇప్పటికీ ఆడియన్స్ ఫ్రెష్ ఫీల్ కలిగిస్తుంటాయి. అయితే కొన్నేళ్లుగా విజయ్ భాస్కర్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. మన్మథుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రమే మెరిశారు. ఇక విజయ్ భాస్కర్ సినిమాలకు దూరం అని అందరూ అనుకున్నారు.
కానీ ఆయన ఇప్పుడు మళ్ళీ మెగా ఫోన్ పట్టి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. యూత్ ఫుల్ కథ ఒకటి రెడీ చేసుకొని నిర్మాతలను సెట్ చేసుకున్నారు. తాజాగా పూజా కార్యక్రమాలతో ఆఫీస్ ఓపెన్ చేశారు. దసరా రోజు ఈ ప్రాజెక్ట్ ను లాంచ్ చేయబోతున్నారు. హీరో హీరోయిన్స్ ఎవరనేది చెప్పలేదు కానీ కొత్తవాళ్లతోనే ఆయన సినిమా తీసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమాతో ఆయన తనయుడు కమల్ ని హీరోగా లాంచ్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.
నిజానికి విజయ్ భాస్కర్ – త్రివిక్రమ్ కాంబో అల్టిమేట్. విజయ్ భాస్కర్ నుండి రైటర్ గా త్రివిక్రమ్ బయటికి వచ్చేసి దర్శకుడయ్యాక విజయ్ భాస్కర్ సక్సెస్ అందుకోలేక సినిమాలు దూరమయ్యారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఓ కథ తయారు చేసుకొని ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ తో సీనియర్ డైరెక్టర్ మంచి కం బ్యాక్ ఇస్తాడా ? లేదా మిగతా సీనియర్ దర్శకుల్లాగే డిజాస్టర్ డెలివరీ చేసి పక్కకి తప్పుకుంటారా ? చూడాలి.
This post was last modified on September 21, 2022 5:21 pm
గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో కథానాయికగా పరిచయం అయింది ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమాలో ప్రోమోల్లో…
‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…