Movie News

సంక్రాంతి 2023 – ఇంకా సస్పెన్సే

ఇంకా మూడు నెలలకు పైగా టైం ఉన్నప్పటికీ రాబోయే సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో ఎవరెవరు ఉంటారనే సస్పెన్స్ అంతకంతా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఇప్పటిదాకా ఆ సీజన్ కు ఖచ్చితంగా వస్తామని చెప్పింది ఒక్క చిరంజీవి వాల్తేర్ వీరయ్యనే. టైటిల్ ఇంకా అఫీషియల్ కాలేదు కానీ హీరో దర్శకుడు ఇద్దరూ పలు సందర్భాల్లో చెప్పేశారు. అలా అని ఆ డేట్ కే కట్టుబడే ఉంటారని గ్యారెంటీగా చెప్పలేం. ఆ టైంకి ఏర్పడే పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు ఉండొచ్చు. అన్నింటిని మించి డిసెంబర్ కంతా షూటింగ్ పూర్తి చేయడం చాలా కీలకం.

దీని కన్నా బాలకృష్ణ 107 చిత్రీకరణ మెరుగ్గా ఉంది. డిసెంబర్ రిలీజ్ సాధ్యపడకపోతే పొంగల్ కే వెళదామని బాలయ్య అంటున్నారట. కానీ పైన చెప్పిన మెగా మూవీ, ఇది రెండూ మైత్రి మూవీ మేకర్స్ వే. సో ఒకటి డ్రాప్ కాక తప్పదు. ప్రభాస్ ఆది పురుష్ రావడం కన్ఫర్మ్ అయితే అప్పుడో కొత్త సమస్య వస్తుంది. థియేటర్ల కౌంట్, బిజినెస్ లెక్కలు దాని కథ వేరే. అక్టోబర్ మొదటి వారంలో టీజర్ లాంచ్ అన్నారు కాబట్టి అది చూసాక విడుదల గురించి క్లారిటీ వస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో విజయ్ హీరోగా రూపొందుతున్న వారసుడుని ఎట్టి పరిస్థితుల్లో ఫెస్టివల్ కి దింపాలని డిసైడ్ అయ్యారట. ఎవరొచ్చినా రాకపోయినా మార్పు ఉండకపోవచ్చు.

ఇవన్నీ కాకుండా అఖిల్ ఏజెంట్ కనక డిసెంబర్ ని మిస్ చేసుకుంటే అదీ సంక్రాంతి బరిలో దిగేందుకు ప్రయత్నిస్తుంది. మొత్తానికి ఎవరుంటారు ఎవరాగుతారనేది అంచనా వేయడం కష్టమే. కొరోనా పూర్తిగా మాయమయ్యాక ఎలాంటి భయాలు లేకుండా వస్తున్న సంక్రాంతి కావడంతో వీలైనంత మేరకు ఈ అవకాశాన్ని వాడుకునేందుకు అందరూ పావులు కదుపుతున్నారు. ఈ ఏడాది దసరా తర్వాత మళ్ళీ ఎక్కువ హాలిడేస్ వచ్చేది జనవరిలోనే. అప్పటిదాకా బాక్సాఫీస్ కొంత నెమ్మదిగానే ఉంటుంది. మరి ఫైనల్ రేస్ లో నిలబడే పందెం కోళ్లు ఏవో వేచి చూడాలి

This post was last modified on September 21, 2022 6:44 am

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

1 hour ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

4 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago