రాశి ఖన్నాఅయినా సముద్రాన్ని పొంగిస్తుందా?

RX 100 దర్శకుడు అజయ్ భూపతి ఎప్పట్నుంచో మహా సముద్రం అనే చిత్రాన్ని మొదలు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. మొదట హీరోలు దొరకలేదు. రవితేజ ఓకే అనుకుంటే అన్నీ సెట్ అయ్యాక తప్పుకున్నాడు. ఆ తర్వాత శర్వానంద్ చేస్తానని చెప్పాడు. సితార బ్యానర్ లో చేయాలనే ప్లాన్ ఉంది కానీ అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు.

అజయ్ భూపతి అయితే మిగతా తారాగణం ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నాడు. మొదట అదితి రావు హైదరి, ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అన్నారు. కానీ ఇప్పుడు రాశి ఖన్నా ఫైనల్ అని చెప్తున్నారు. మరి రాశి ఖన్నా అయినా ఈ సముద్రాన్ని పొంగిస్తుందా లేదా అనేది చూడాలి.

ఇందులో మరో హీరో క్యారెక్టర్ కూడా ఉంది. రవితేజ హీరో అనుకున్నప్పుడు సిద్ధార్థ్ ని అనుకున్నారు. శర్వానంద్ పక్కన అతడినే తీసుకుంటారా లేక వేరే హీరోని సంప్రదిస్తారా అనేది ఇప్పటికైతే సస్పెన్సు.