Movie News

2 బ్లాక్ బస్టర్లు – OTT ఫ్యాన్స్ ఎదురుచూపులు

ఇంతకు ముందైతే కొత్త సినిమాల థియేట్రికల్ రిలీజ్ కోసం మాత్రమే ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ తర్వాత శాటిలైట్, డివిడి, యూట్యూబ్ తదితరాల్లో బాగా ఆలస్యం ఉండేది కాబట్టి వాటి తాలూకు ఎగ్జైట్మెంట్ నెలల తరబడి కొనసాగేది. కానీ ఇప్పుడలా కాదు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే మహా అయితే నెల రోజులు లేదా అదనంగా మరో వారం. అంతకన్నా లేట్ చేస్తే జనాల్లో ఆసక్తి తగ్గిపోయి ఇంత లేటా అంటూ చూడటం కూడా ఆలస్యం చేస్తున్నారు. అందుకే కొలిమి వేడి మీద ఉన్నప్పుడే పని కానిచ్చేయాలి. లేదంటే తేడాలొస్తాయి. అది హిట్ బొమ్మైనా ఫ్లాప్ మూవీ అయినా.

సీతారామం 35 రోజులకే ప్రైమ్ లో వచ్చేసింది. మిలియన్ల వ్యూస్ తో ఆ ప్లాట్ ఫార్మ్ మీద టాప్ 1 ట్రెండింగ్ లో ఉంది. హిందీ వెర్షన్ విడుదలైన వారానికే దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ చేసేయడంతో అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఓటిటి ఫ్యాన్స్ చూపు బింబిసార, కార్తికేయ 2 మీద ఉంది. ఈ రెండు హక్కులు జీ5 సాంతం చేసుకుంది. ప్రీమియర్ల విషయంలో కొంత నెమ్మదిగా ఉండే ఈ సంస్థ వీటిని కూడా ఆలస్యం చేస్తూ వస్తోంది. నిఖిల్ మూవీ బాలీవుడ్ లో మొదటి రెండు మూడు వారాలు దూసుకుపోయినప్పటికీ బ్రహ్మాస్త్ర వచ్చాక నెమ్మదించక తప్పలేదు.

ఇక కళ్యాణ్ రామ్ సినిమా ఎప్పుడో స్లో అయ్యింది. ప్రధాన కేంద్రాల్లో మాత్రమే రన్ కొనసాగుతోంది. బయ్యర్లకు డబుల్ ప్రాఫిట్స్ వచ్చేశాయి కనక ఇక ఆశించడానికి ఏమి లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం బింబిసారని సెప్టెంబర్ 23 డిజిటల్ డేట్ లాక్ చేసే ఆలోచనలో సదరు టీమ్ ఉన్నట్టు సమాచారం. కార్తికేయ 2ని వారం గ్యాప్ తో అదే నెల 30, ఒకవేళ అది సాధ్యం కాకపోతే దసరా కానుకగా అక్టోబర్ 5 లేదా 7న వదిలే ప్లానింగ్ జరుగుతోందట. వీటిలో ఏ డేట్ కన్ఫర్మ్ అయినా చాలా దగ్గరలో ఉన్నట్టే. థియేటర్లలోనే అంత భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న బింబిసార, కార్తికేయ 2లు ఓటిటిలో చేయబోయే రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో

This post was last modified on September 17, 2022 6:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

4 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

5 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

5 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

6 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago