అసలే డబ్బింగ్ సినిమా. దానికి తోడు హఠాత్తుగా రిలీజ్ డేట్ ప్రకటించారు. అప్పటికప్పుడు అల్లు అరవింద్ రంగంలోకి దిగి నేను పంపిణి చేస్తానంటూ తమిళ ప్రొడ్యూసర్ కు అండగా నిలిచారు. ఇలాంటి పరిస్థితిలో దేనికైనా బజ్ రావడం అంత ఈజీ కాదు. ఆ పరిస్థితి ధనుష్ నేనే వస్తున్నాకు వచ్చింది. అతని అన్నయ్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో పదేళ్ల తర్వాత నటిస్తున్న మూవీ ఇది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి ఇప్పుడు ఏకంగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ ని ఢీ కొట్టేందుకు రెడీ అవుతోంది. డేట్ చెప్పలేదు కానీ సెప్టెంబర్ 29 అని చెన్నై టాక్.
మరి ఇంత లో ప్రొఫైల్ లో వస్తున్నప్పుడు టీజర్ కట్ చాలా కీలకం. సెల్వ రాఘవన్ బృందం ఇక్కడే తమ అద్భుతమైన పనితనాన్ని చూపించింది. ఊహకందని కథతో ధనుష్ ని రెండు షేడ్స్ లో చూపిస్తూ ఆడియన్స్ కి షాక్ ఇవ్వబోతున్నట్టు కేవలం నిమిషంన్నర వీడియోతో క్లారిటీ ఇచ్చేశారు. హీరో విలన్ రెండూ తనే చేసినట్టు కనిపిస్తోంది. ఒకపక్క మధ్య తరగతి ఫ్యామిలీ మ్యాన్ గా, మరోవైపు అడవిలో బాణాలు గన్నులు పట్టుకుని తిరుగుతూ హత్యలు చేసేందుకు వెనుకాడని కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ గా చాలా విచిత్రంగా క్యారెక్టర్స్ ని డిజైన్ చేశాడు సెల్వ.
మొత్తానికి అంచనాలు రేపడంలో టీజర్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఇటీవలే వచ్చిన తిరు 100 కోట్ల సక్సెస్ తో ధనుష్ లో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు వెర్షన్ సైతం బయ్యర్లకు లాభాలు ఇచ్చిందే. ఇప్పుడీ నేనే వస్తున్నా కనక హిట్టు కొడితే రఘువరన్ బిటెక్ టైంలో వచ్చిన యూత్ ఫాలోయింగ్ మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. మరి 29కి కట్టుబడతారా లేక ఒకవారం ముందు 23కే వస్తారా అనేది నిర్మాతలు తేల్చి చెప్పడం లేదు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ప్రభు, యోగిబాబు, తులసి తప్ప మిగిలిన క్యాస్టింగ్ అంతా అరవ బ్యాచే ఉంది.
This post was last modified on September 16, 2022 6:32 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…